పాలమూరు, అక్టోబర్ 6 : దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ప్రధాని మోదీ విఫలమయ్యారని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు ప్రకటించారని, ఆ హామీ ఏమైందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మోదీని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌కు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు శుక్రవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మెట్టుగడ్డ నుంచి ప్రారంభమైన ర్యాలీలో పదివేల మందికి పైగా విద్యార్థులు పాల్గొని తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించగా ఈ సందర్భంగా థ్యాంకూ సీఎం సార్, థ్యాంకూ శీనన్న అన్న నినాదాలు మార్మోగాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో విఫలమైన బీజేపీ నాయకులు కులం,మతం పేరిట యువతను రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, పొరపాటున కూడా యువత వారి మాయలో పడొద్దని సూచించారు. యాదాద్రి, మన్యంకొండ లాంటి అనేక ఆలయాలను తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. గూగుల్, ఆపిల్లాంటి ప్రఖ్యాత కంపెనీలకు తెలంగాణకు తీసుకొచ్చి రాష్ట్ర యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తోందని, మహబూబ్‌నగర్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ కంపెనీలను తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో వచ్చిన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ద్వారా స్థానికంగానే నాణ్యమైన ఉచిత ఇం జినీరింగ్ విద్య చదివి ఇక్కడే పెద్దపెద్ద ఐటీ ఉద్యోగాలు చేసుకోనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. 70 ఏండ్ల లో ఒక్క ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల కూడా తీసుకురాలేని వారు ఇప్పుడు ఎన్నికల వేళ మాయమాటలు చె ప్పేందుకు ప్రజల వద్దకు వస్తున్నారని వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలోనే అ త్యధిక పంటలు పండిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఉందని, త్వరలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లా మొత్తం సాగులోకి వచ్చేలా కృషి చేస్తామని ప్రకటించారు. అత్యధిక పరిశ్రమలను తీసుకువచ్చి స్థానికంగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటానికి విద్యార్థులు క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్వీ నాయకులు శివ, నాని, సత్యపాల్, మనీశ్‌గౌడ్, పవన్, వినయ్, సాయి, శ్రీకాంత్‌తోపాటు వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి
మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో సింథటిక్ట్రాక్, వాలీబాల్ అకాడమీ హాస్టల్ భవన నిర్మాణానికి పనులకు భూమిపూజ, మున్సిపాలిటీ ఆవరణలో నిర్మించిన కళాభారతిని ప్రారంభించారు. అదేవిధంగా వీరన్నపేట కమ్యూనిటీహాల్, పాతతోట ఎస్సీ కమ్యూనిటీహాల్, పాల్కొండ సమీపంలో బైపాస్పాస్రోడ్డు ఫుట్‌పాత్, సీసీరోడ్డు నిర్మాణ పనులు, వన్‌టౌన్ జంక్షన్ నిర్మాణ పనులు, పాతపాలమూరు రిలయన్స్ ట్రెండ్స్ సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమిపూజ చేసి, కోయిలకొండ ఎక్స్‌రోడ్డు సమీపం స్లాటర్ హౌస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలో జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు మహబూబ్‌నగర్ అతిథ్యం ఇవ్వనుందన్నారు. మున్సిపాలిటీ ఆవరణలో కళాకారులకు, సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకునేందుకు కొత్త సాంకేతికతో కళాభారతి నిర్మించామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మ న్ వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటిగణేశ్తోపాటు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టూరిజం హబ్‌గా మైసమ్మ ఆలయం..
ఫత్తేపూర్ మైసమ్మ ఆలయాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ ఆలయ ఆవరణలో రూ.కోటితో నిర్మించనున్న సామూహి క భవనం, మీటింగ్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ ఆవరణలో అతిథి భవనం, రోప్‌వే, భక్తులకు కాటేజీలు నిర్మించేందుకు రూ.15కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు.