మాగనూరు కృష్ణ : మాగనూరు ఉమ్మడి మండల పరిధిలో ఖాన్ దొడ్డి గ్రామ శివారులోని అంజప్ప ఇటుక బట్టీలో అక్రమ ఇసుక ( Illegal Sand ) డంప్‌ను గుర్తించారు. ఈ సందర్భంగా ఆర్ఐ శ్రీనివాస్ గౌడ్( RI Srinivas Goud ) మాట్లాడుతూ అంజప్ప ఇటుక బట్టీలో రెండు ట్రిప్పర్ల ఇసుక డంపు వేసినట్లు సమాచారం రావడంతో తహసీల్దార్ శ్రీనివాసులు ఆదేశాలతో ఇసుక డంప్‌ను సీజ్ చేశామని అన్నారు. కొందరు అక్రమార్కులు ఇసుక డంపులు వేసి కర్ణాటక రాష్ట్రానికి రూ.30 వేలకు అమ్ముకుంటున్నారనే సమాచారం ఉందని తెలిపారు. అక్రమ ఇసుక డబ్బులు వేసి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.