జడ్చర్లటౌన్, మే30 : జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్కాలనీ, వెంకటేశ్వరకాలనీలో ఓ వీధి కుక్క కాటుతో పదిమందికి గాయాలైన ఘటన శుక్రవారం వెలుగుచూసిం ది. ఇందిరానగర్కాలనీ నుంచి వెంకటేశ్వరకాలనీ వ రకు ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసి అటుగా వచ్చిన చిన్నారులపై దాడి చేసింది. అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులోని సత్యనారాయణస్వామి ఆలయం సమీపంలో కుక్క కాటుతో ఓ మహిళ గాయపడింది.
వేర్వేరు కుక్కల దాడిలో పది మంది గాయపడి చికిత్స నిమిత్తం జడ్చర్ల ఏరియా దవాఖానకు రాగా వైద్యసిబ్బంది బాధితులకు వైద్య చికిత్సలు అందించారు. కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మున్సిపల్ అధికారులు స్పందించి పట్టణంలో కుక్కలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.