బిజినపల్లి : మండలంలోని లట్టుపల్లి,మంగనూరు, గౌరారం,ఎర్ర కుంట తండా,నక్కల చెరువు తండా,ఊడుగులకుంట తండా తదితర గ్రామాలు, తండాలలో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం (Storm damage ) సృష్టించింది. భారీ చెట్లు,పెద్ద స్తంభాలు గాలివానకు నేలకొరిగాయి.
వరి ధాన్యం, మొక్కజొన్న వంటివి గాలివానకు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట ఒక్కసారిగా గాలివానకు తడిసి పోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. గాలివాన భీభత్సంతో విద్యుత్ అంతరాయం కలిగిందన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకొని నష్ట పరిహారం అందించాలని కోరారు.