రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్పర్సన్ రజినీసాయిచంద్ కొత్తకోట/ అమరచింత, సెప్టెంబర్ 20 : సాయిచంద్ తనకు మహా కుటుంబాన్ని పరిచయం చేశాడని రాష్ట్ర గిడ్డంగుల చైర్పర్సన్ రజినీసాయిచంద్ అన్నారు. బుధవారం సాయిచంద్ జయంతిని పురస్కరించుకొని కొత్తకోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె అంధుడితో కేక్‌కట్ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాయిచంద్ హైదరాబాద్‌కు వెళ్లేటప్పుడు ఒక వృద్ధుడు కలిశాడని ఆయన ఏం లేకుండా ఎలా బతుకుతావని ప్రశ్నించగా తన పాట ద్వారా తెలంగాణ ప్రజలను జాగృతి చేసి తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తానన్నారు.
తనతో మొదటి అడుగు వేసేటప్పుడు తెలంగాణ ప్రజలే తమ కుటుంబ సభ్యులని, అంద రూ అండగా ఉంటారని ధైర్యనిచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, ఎంపీపీ గుంతమౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, వైస్ చైరపర్సన్ జయమ్మ, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్ తదితరులున్నారు. అమరచింతలో సాయిచం ద్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్ పర్సన్ రజినీసాయిచంద్ మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజుతో కలిసి భారీకేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బీ ఆర్ఎస్ నాయకులు నాగభూషణంగౌడ్, రమేశ్, నర్సింహులుగౌడ్, చిన్నబాలరాజుతోపాటు సాయిచంద్ అభిమానులు, మిత్రులు ఉన్నారు.