మహబూబ్నగర్ అర్బన్, డిసెంబర్ 27 : జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలోని ఇండోర్లో శుక్రవారం రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను డీవైఎస్వో శ్రీనివా స్, క్రీడా సంఘాల నాయకులతో కలిసి ప్రా రంభించారు. అంతకుముందు మాజీ ప్రధా ని మన్మోహన్సింగ్కు రెండు నిమిషాలు మౌ నం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం డీవైఎస్వో శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటడం వల్ల మ రింత ఉన్నత స్థాయి ఎదిగే అవకాశం ఉందన్నారు. పోటీలకు వచ్చిన క్రీడాకారులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పా ట్లు పూర్తి చేశామని ఆయన వివరించారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల నాయకులు విలియం, జగన్మోహన్గౌడ్, బాలరాజు, వేణుగోపాల్, వడెన్న, గజానంద్, నిరంజన్, చెన్నవీరయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు 45-32 పాయింట్స్ తేడాతో మేడ్చల్పై, కొత్తగూడెం జట్టు 23-16 తేడాతో సూర్యపేట జట్టుపై, నల్లగొండ జట్టు 35-15 తేడాతో సిరిసిల్ల జట్టుపై, గద్వాల జట్టు 44-15 తేడాతో నిర్మ ల్ జట్టుపై, నాగర్కర్నూల్ జట్టు 28-17 తే డాతో జగిత్యాల జట్టుపై, హైదరాబాద్ జట్టు 41-15 తేడాతో కామారెడ్డి జట్టుపై, కరీంనగర్ జట్టు 27-11తేడాతో వరంగల్ జట్టుపై, ములుగు జట్టు 48-26 తేడాతో మెదక్ జట్టుపై, వనపర్తి జట్టు 38-10 తేడాతో మహబూబ్నగర్ జట్టుపై, నిజామాబాద్ జట్టు 24-15 పాయింట్స్ తేడాతో భూపాలపల్లి జట్టుపై విజయం సాధించాయి. బాలికల విభాగంలోనూ నల్లగొండ జట్టు 70-18 పాయింట్స్ తేడాతో నిజామాబాద్ జట్టుపై, రంగారెడ్డి జట్టు 50-07 తేడాతో సిద్దిపేట జట్టుపై, హైదరాబాద్ 49-18 తేడాతో నా రాయణపేట్ జట్టుపై, మహబూబాబాద్ జ ట్టు 30-26 తేడాతో ఖమ్మం జట్టుపై, గద్వా ల జట్టు 55-12 తేడాతో భవనగిరిపై, మహబూబ్నగర్ జట్టు 57-09 తేడాతో ఆదిలాబాద్ జట్టుపై, సంగారెడ్డి జట్టు 50-10 తేడాతో పెద్దపల్లి జట్టుపై, నాగర్కర్నూల్ 41-04 తేడాతో మెదక్ జట్టుపై, మేడ్చల్ జట్టు 34-20 తేడాతో కామారెడ్డి జట్టుపై విజయం సాధించాయి.
ఉమ్మడి పాలమూరు జట్లు మొదటి రోజు శుభారంభం చేశాయి. బాలికల విభాగంలో మహబూబ్నగర్ జట్టు-ఆదిలాబాద్ జట్టు పై, గద్వాల జట్టు – భువనగిరిపై, నాగర్కర్నూల్ జట్టు మెదక్ జట్టుపై, బాలుర విభాగంలో గద్వాల జట్టు – నిర్మల్ జట్టుపై, నాగర్కర్నూల్ జట్టు – జగిత్యాల్ జట్టుపై, వనపర్తి జట్టు – మహబూబ్నగర్ జట్టుపై విజయం సాధించాయి.