కృష్ణమ్మ పరవళ్లు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద నీరు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టు అధికారులు జూరాల వద్ద 22 గేట్లు ఎత్తి 84,524 క్యూసెక్కులను దిగువన ఉన్న శ్రీశైలం రిజర్వాయర్‌కు వదులుతున్నా రు.
- జూరాలకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద
- 22 గేట్ల ఎత్తి దిగువకు నీటి విడుదల
- ప్రాజెక్టుకు పెరిగిన సందర్శకుల తాకిడి
- టీబీడ్యాంకు 1,25,911 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- 79.969 టీఎంసీల నీటి నిల్వ
గద్వాల, జూలై 21 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద నీరు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ప్రాజెక్టు అధికారులు జూరాల వద్ద 22 గేట్లు ఎత్తి 84,524 క్యూసెక్కులను దిగువన ఉన్న శ్రీశైలం రిజర్వాయర్‌కు వదులుతున్నా రు. దీంతో మొన్నటివరకు బీచుపల్లి వద్ద నీరులేక వెలవెలబోయిన కృష్ణమ్మ నేడు నిండుగా ప్రవహిస్తున్నది. కృష్ణమ్మ పరవళ్లు తిలకించేందుకు ఆదివారం సందర్శకులు జూరాల, బీచుపల్లి వద్దకు భారీగా తరలివచ్చారు.
ఆదివారం రాత్రి 9 గంటలకు జూరాలలో 1,29,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. అవుట్‌ఫ్లో 1,19,280 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.100 మీటర్లుగా ఉన్నది. పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.914 టీఎంసీలుగా ఉన్నది. ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ 11 యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతున్నది. అదేవిధంగా జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి 30,148, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 1,500, భీమా లిఫ్ట్-1కు 1,300, భీమా లిఫ్ట్-2కు 750, జూరాల ఎడమ కాల్వకు 870, కుడి కాల్వకు 596, సమాంతర కాల్వకు 300 క్యూసెక్కుల నీ టిని విడుదల చేస్తున్నారు. కాగా, నారాయణపూర్ డ్యాం వద్ద 25 గేట్లు ఎత్తి దిగువకు 1,45,750 క్యూసెక్కులు విడుదల చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

