మూసాపేట, డిసెంబర్ 28 : దళిత యువతిపై సామూహిక లైంగికదాడి జరిగినట్లు తాము ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వెల్లడించారు. మూసాపేట మండలం వేములలో ఈనెల 17వ తేదీన లైంగికదాడి, హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. యువతి చిత్రపటానికి నివాళులర్పించి బాధితులతోపాటు గ్రామస్తులతో మాట్లాడారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం మృతురాలి తండ్రికి రూ.3.47 లక్షల చెక్కును అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఘటనపై ఆరా తీస్తే ఇది కేవలం ఒకరితో అయిన పని కాదని, సా మూహిక లైంగిక దాడి జరిగి ఉంటుందని ఆయనన్నారు. దోషులు ఎంతటి వారు ఉన్నా.. సమగ్ర విచారణ చేపట్టి శిక్షపడేలా చేస్తేనే యువతికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. బాధిత కు టుంబానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నిందితుడిని పోలీసులు కష్టడీకి తీసుకొని పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఎస్పీ, డీ ఎస్పీ సూచించనున్నట్లు తెలిపారు.
బాధిత కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదని, అందుకే ఇందిరమ్మ ఇల్లు మంజూరుతోపాటు భూమి కేటాయించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే కుటుం బ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తామన్నా రు. రూ.4,12,500 చెక్కు అందాల్సి ఉండగా.. రూ.3.47లక్షలు మాత్రమే అందజేస్తున్నట్లు తెలిపా రు. ఈ విషయంపై కలెక్టర్‌తో మాట్లాడి మిగతా మొ త్తాన్ని అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఆర్డీవో నవీన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, గిరిజన అభివృద్ధి జిల్లా అధికారి జనార్దన్, సాంఘిక, సంక్షేమ సహాయక అధికారి సుదర్శన్, సీఐ అ య్యప్ప, తాసీల్దార్ రాజు, ఎస్సైలు వేణు, శ్రీనివాసు లు, గ్రామస్తులు, నాయకులు ఉన్నారు.