అచ్చంపేట, జనవరి 1 : శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద వారం రోజులుగా నీటి లీకేజీ జరుగుతోంది. పవర్ హౌజ్‌లోని 1వ యూ నిట్ జీరో ఫ్లోర్ డ్రాప్ట్‌ట్యూబ్ నుంచి నీటి ధార కొనసాగుతున్నది. డ్రాప్ట్‌ట్యూబ్ నుంచి లీకేజీ జరుగుతున్న విషయాన్ని డిసెంబర్ 25వ తేదీన సిఫ్ట్ అధికారులు గుర్తించి జెన్కో అధికారుల దృష్టికి తీ సుకెళ్లారు. దీంతో జెన్కో అధికారులు లీకేజీని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హైదరాబాద్ నుంచి విద్యుత్‌సౌధ నుంచి జనరల్ సర్వీసెస్ సీవిల్ సీఈ హైడల్ నారాయణ వచ్చి పరిశీలించారు.
లీకేజీకి సంబంధించి నివేదిక ఇవ్వాలని స్థానిక ఇంజినీర్లను ఆదేశించారు. నీటి లీకేజీని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. గంటగంటకు వెళ్లి షిఫ్ట్ సిబ్బంది పరిశీలిస్తున్నారు. అయితే రీవర్స్ వి ద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల వైబ్రెషన్కు గురై నీటి ఒత్తిడి పెరిగి లోపల ఉన్న పైపు వెల్డింగ్ నుంచి లికే జీ అవుతున్నట్లు జెన్కో అధికారులు భావిస్తున్నా రు.
పంపు మోడ్‌లో టర్బైన్ వేగంగా తిరుగుతుండ డంతో డ్రాఫ్ట్‌ట్యూబ్ జీరో ఫ్లోర్ స్లాబ్ నుంచి నీ టి ధారగా లీకేజీ జరుగుతుంది. సర్జి చాంబర్, పెన్‌స్టాక్ గేట్లను మూసివేసి, టర్బైల్లో నిల్వ ఉండే నీ టిని పూర్తిగా తొలగించి లోపలికి వెళ్లి పరిశీలించా ల్సి ఉంటుంది. లీకేజీని పరిశీలించాలంటే నాగార్జునసాగర్‌లో వాటర్ లెవల్ తగ్గాలని ఎస్ఈ సివిల్ రవీంద్రకుమార్ తెలిపారు. ప్రమాదం లేదని, కా ంక్రీట్కు వెల్డింగ్ చేస్తే సరిపోతుందని తెలిపారు.
చిన్నపాటి నీటి ధార వస్తుంది. నిమిషానికి 3-4లీటర్ల వరకు లీకేజీ అవుతున్నది. డిసెంబర్ 25వతేదీ నుంచి లీకేజీ ప్రారంభమైంది. అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు మా సిబ్బంది అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నారు. పెరిగిందా? తగ్గిందా? అనేది పరిశీలన చేస్తున్నాం. లీకేజీ ప్రారంభమైనప్పటి నుంచి ఒకేవిధంగా నీటి ధార వస్తోంది. బుధవారం నుంచి రీవర్స్ పంపింగ్ విద్యుదుత్పత్తిని ఆపేశాం. అండర్‌గ్రౌండ్ విద్యుత్ ప్రాజెక్టులో ఇలాంటి చిన్న చిన్న లీకేజీలు సహజం. లోపలికి వెళ్లి పరిశీలించాలంటే నాగార్జునసాగర్‌లో వాటర్ లెవల్ తగ్గాలి. కాంక్రీట్‌లో వెల్డింగ్ వేస్తే సరిపోతుంది.
– రామసుబ్బారెడ్డి, సీఈ