ఉప్పునుంతల, అక్టోబర్ 31 : మండలంలోని లత్తీపూర్ స్టేజీ సమీపంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి మరమ్మతు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఆర్టీహెచ్)హైదరాబాద్ రీజినల్ ఆఫీసర్, చీఫ్ ఇంజినీర్ కృష్ణప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన ఎస్ఈ ధర్మారెడ్డితో కలిసి డిండి వాగు అలుగువద్ద వరద ప్రభావంతో కూలిపోయిన రెండో వంతెనను పరిశీలించారు. మూడు రోజులుగా కొనసాగిన తుఫాన్ వర్షాల కారణంగా హైవే తీవ్రంగా దెబ్బతిందని వారు తెలిపారు.
అధికారులు, కాంట్రాక్టర్ సమన్వయంతో పునరుద్ధరణ పను లు వేగంగా సాగుతున్నాయన్నారు. ఎస్ఎస్ఆర్ కాం ట్రాక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి , ఆయ న బృందం నిరంతర శ్రమతో తాత్కాలికంగా దెబ్బతిన్న భా గాలను పునరుద్ధరిస్తున్నారని శనివారానికి రోడ్డు రాకపోకలకు ఎటువంటి అంతరా యం లేకుండా అందుబాటులోకి తీసుకవచ్చే లా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులను తట్టుకునే లా రహదారిని బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఆయన వెం ట డీఈఎన్ రమేశ్‌బాబు, ఏఈ చంద్రకాంత్‌రెడ్డి, కాం ట్రాక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి, నవీన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.