నాగర్‌కర్నూల్, జూలై 29 (నమస్తే తెలంగా ణ) : శ్రీశైలం జలాశయం నీటినిల్వలు గరిష్ఠ స్థాయికి చేరాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాయలసీమ అధికారులు 3 గేట్లను ఎత్తడంతో నురగలు కక్కుతూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. మొదట మంగళవారం గేట్లు ఎత్తాల ని అధికారులు భావించినా భారీగా వస్తున్న ఇన్‌ఫ్లోతో ముందుగానే ప్రాజెక్టులోని 6, 7, 8వ నెం బర్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కుల చొప్పున 77 వేల క్యూసెక్కులు దిగువకు పారుతున్నాయి. జూరాల, సుంకేశుల నుంచి ఇ ప్పటికీ 4 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నది.
వరద ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీ టిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.20 అడుగులకు చేరగా.. సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా.. 189.4542 టీఎంసీలకు చేరింది. ఎడమ, కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రా ల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. గేట్లు, వి ద్యుదుత్పత్తి ద్వారా 1,39,220 క్యూసెక్కుల అ వుట్ఫ్లో నమోదైంది. అంతకు ముందే మత్స్యకారులతో పాటుగా పలు ప్రాంతాల ప్రజలను ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం చేశారు.
ఈ ఎండాకాలంలో కనిష్ఠ స్థాయికి జలాశ యం నీటిమట్టం చేరగా.. ఈనెల 16 వరకు కేవ లం 30 టీఎంసీలు, 806 అడుగుల మాత్రమే ఉన్నాయి. కానీ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌కు భారీగా వరద రావడంతో నీటి విడుదల మొదలైంది. వారం రోజులుగా అక్కడి నుం చి విడుదల కొనసాగుతుండడంతో జలాలు శ్రీశైలానికి చేరుకున్నాయి. దీంతో 17న ముందస్తు గా శ్రీశైలం పవర్ హౌజ్ ద్వారా 7500 క్యూసెక్కుల నీటి విడుదల ప్రారంభమైంది. ఇలా కేవ లం 12 రోజుల్లోనే నిరంతర వరద రాకతో ప్రా జెక్టుకు జలకళ సంతరించుకున్నది. ప్రస్తుతం జూరాల 42 గేట్ల నుంచి 2,76, 291 క్యూసెక్కులు,
విద్యుదుత్పత్తితో 18,755 క్యూసెక్కులు విడుదలవుతుండగా.. సుంకేసుల నుంచి 1,58,142 క్యూసెక్కుల చొప్పున 4, 53,188 క్యూసెక్కుల వరద వస్తున్నది. గతేడా ది ఒకేసారి కొద్ది రోజులు మాత్రమే డ్యాం గేట్లు తెరుచుకోగా ఈసారి జూలై చివరలోనే ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. భారీ ఇ న్‌ఫ్లో కారణంగా ఎడమ, కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. దీనివల్ల 61,604 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇక డ్యాం ఆధారిత ఎత్తిపోతల పథకాలకు నీటి కొరత తప్పనున్నది. అలాగే తాగునీటికీ ఇబ్బందులు తీరనున్నాయి.
శ్రీశైలం డ్యాం పరిసరాల్లో పర్యాటకులు సందడి నెలకొన్నది. గేట్లు తెరుస్తారన్న సమాచారం మేరకు కొందరు ముందుగానే అక్కడకు చేరుకొని నీటి విడుదలను ఫోన్లల్లో చిత్రీకరించారు. మరికొందరు సెల్ఫీలు దిగుతూ సందడిగా గడిపారు.