హన్వాడ, జూలై 31 : మండలంలోని టంకరలో బుధవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. నైవేద్యం సిద్ధం చేసి కొత్త కుండలలతో మహిళలు బైలెల్లారు. గ్రామంలోని పోచమ్మ ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. కోళ్లు, మేకలతో మొక్కులు చెల్లించుకున్నారు.
అంతకుముందు పండుగకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను సామాల సహదేవ్, సామాల వెంకటగిరి, శివకుమార్, జహంగీర్, ఆశన్న, శ్రీనివాస్‌తోపాటు గ్రామ ప్రముఖులు ఆహ్వానించగా.. పోచమ్మ తల్లికి, బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మాజీ మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యలతో వర్ధిల్లాలని, వేసిన పంటలు పుష్కలంగా పండాలని, అందుకు అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. తెలంగాణ ఏర్పడ్డాకే పండుగలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.
తాను మంత్రిగా ఉన్న సమయంలో ఆలయాన్ని నిర్మించి.. బస్టాండ్ నుంచి సీసీరోడ్డు వేయించినట్లు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, మాజీ వైస్ ఎం పీపీ లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ చెన్నయ్య, నాయకులు రాజుయాదవ్, జంబులయ్య, శివకుమార్, ఆశ న్న, వెంకటయ్య, బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.