మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 25 : రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం లో.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి సమక్షంలో మహబూబ్‌నగర్ మం డలం ధర్మాపూర్ మాజీ ఎంపీటీసీ రవీందర్రెడ్డిపాటు పట్టణంలోని 31వ వార్డుకు చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైఫొద్దీన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
వీరికి మాజీ మంత్రులు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇంత వరకు పాలనలో ఎలాంటి పురోగతి లేదన్నారు. రాష్ర్టాన్ని దివాలా తీయించడంతోపాటు అన్నివర్గాల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని మండిపడ్డారు.
వంగూరు, ఏప్రిల్ 25 : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి రాజభోగం అనుభవిస్తున్నారని, పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మండలంలోని సర్వారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పుల్లయ్యయాదవ్, నర్సంపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అలివేల శ్రీశైలంయాదవ్ శుక్రవారం వంగూరులో గువ్వల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ సీఎం రే వంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక సొంత గ్రామమైన కొం డారెడ్డిపల్లిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినా ఇప్పటి వరకు ఏ ఒక్కటీ పూర్తికాలేదని ఆరోపించారు. అభివృద్ధిని అటుంచితే ఇద్దరిని పొట్టనపెట్టుకున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గణేశ్‌రావు, నరేందర్‌రావు, మార్కెట్ క మిటీ మాజీ వైస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కేటీఆర్ సేవా సమి తి జిల్లా అధ్యక్షుడు సురేందర్, ప్రవీణ్‌రెడ్డి, శ్రీపతిరావ్, జైపాల్‌రెడ్డి, రాజురావు, అంజి, జీవన్, లక్ష్మణ్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహారెడ్డి, నాగేశ్, సత్యం తదితరులు ఉన్నారు.
కొల్లాపూర్, ఏప్రిల్ 25 : మంత్రి జూపల్లి ఇలాకలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం జూపల్లి సొంత మండలం చిన్నంబావికి చెందిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈదన్నయాదవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాజీ బీరం మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు దొంగ హామీలిచ్చి అధికారంలో వచ్చిందన్నారు. కాలం గడిచేకొద్ది కాంగ్రెస్ ముసు గు తొలుగుతోందని, ఈ క్రమంలోనే నాయకులు ఆ పార్టీ ని వీడి భవిష్యత్ ఉన్న బీఆర్ఎస్లోకి వస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండగా, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలోనే అధోగతి పాలైందని మండిపడ్డారు. బీఆర్ఎస్లో చేరిన ఈదన్నయాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.