కమనీయం.. రాములోరి కల్యాణం
అపర భద్రాద్రిగా పేరుగాంచిన శిరుసనగండ్ల క్షేత్రం భక్తజన సంద్రమైంది. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చి వేడుకను తిలకించి పరవశించిపోయారు.
- జనసంద్రమైన సిరుసనగండ్ల
చారకొండ/కల్వకుర్తి, ఏప్రిల్ 17 : అపర భద్రాద్రిగా పేరుగాంచిన శిరుసనగండ్ల క్షేత్రం భక్తజన సంద్రమైంది. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం జరిగిన సీతారాముల కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చి వేడుకను తిలకించి పరవశించిపోయారు. ఆలయ చైర్మన్ రా మశర్మ తలంబ్రాలు, పట్టువస్ర్తాలు తీసుకురాగా.. మ ధ్యాహ్నం ఒంటి గంటకు పండితుల వేదమంత్రాలు, భాజా భంజత్రీలు, డప్పు వాయిద్యాల మోతల మధ్య కల్యాణం కమనీయంగా సాగింది.
వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చలువ పంది ళ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు గుట్టపైకి కేవలం వీఐపీల వాహనాలను మాత్రమే అనుమతించారు. కల్వకు ర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, చారకొండ ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచారు.
ప్రముఖుల హాజరు..
కల్యాణానికి సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సతీమ ణి గువ్వల అమల హాజరయ్యారు. వీరితోపాటు బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమా ర్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎం పీ రాములు, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్, జాతీయ బీసీ కమిషన్ మాజీ స భ్యుడు తల్లోజు ఆచారితోపాటు ఎంపీపీ నిర్మల, మాజీ జెడ్పీటీసీలు వెంకట్‌గౌడ్, భీముడునాయక్, ఎంపీటీసీ లు లక్ష్మణ్‌నాయక్, లక్ష్మణ్, లలిత, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

