ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న జడ్చర్ల నియోజకవర్గం నేడు ప్రగతికి ఖిల్లాగా మారింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ సహకారంతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నిధుల వరద పారించారు. రూ.కోట్ల తో పలు అభివృద్ధి పనులు చేపట్టడంతో రూపురేఖలు మారాయి. రోడ్ల విస్తరణ, కూడళ్ల సుందరీకరణ, పార్కుల ఏర్పాటుతో నూతన సొబగులు అద్దుకున్నది. రూ.30 కోట్లతో వంద పడకల వైద్యశాల, బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, సీహెచ్సీలలో అధునాతన పరికరాలు ఏర్పాటు చేయడంతో పేదలకు వైద్యం చేరువైంది. మినీట్యాంక్‌బండ్ వద్ద వాకింగ్‌ట్రాక్, సేద తీరేందుకు కుర్చీలు, పిల్లల కోసం ఆటవస్తువులు సమకూర్చడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. పల్లెలు, పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించారు. మన ఊరు-మన బడి కింద పాఠశాలల్లో అన్ని రకాల సదు పాయాలు సమకూర్చారు. జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధి పరుగులు పెట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్ఎల్ఐలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్‌తో రైతులు, ప్రజల దశ మారనున్నది.
జడ్చర్ల/జడ్చర్ల టౌన్, అక్టోబర్ 16: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామా లు అభివృద్ధి చెందడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూ.కోట్ల నిధులను వెచ్చిస్తున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతువేదికలు, రిజర్వాయర్ల నిర్మాణం, పట్టణ, పల్లె ప్రగతి, నిరంతర ఉచిత విద్యుత్, హరితహారం, రోడ్లు, వైకుంఠధామాలు, డబుల్బెడ్రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ గ్రామం వద్ద 16 టీఎంసీలతో రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే నియోజకవర్గంలోని దాదాపు 1.50 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. నియోజకవర్గంలో దాదాపు రూ.100 కోట్లతో మిషన్‌కాకతీయ పథకం కింద పూడికను తీయడంతోపాటు చెరువుల కట్టలను పటిష్టం చేశారు. దీంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. భూగర్భజలాలు పైపైకి రావడంతో సాగుకు ఇబ్బందుల తొలగాయి.
నియోజకవర్గంలో రూ.6.40 కోట్లతో 32 రైతువేదికలను నిర్మించడంతో అన్నదాతలకు వ్యవసాయాధికారులు సాగులో మెళకువలు నేర్పిస్తున్నారు. రైతులందరూ కలిసి సమావేశాలు ఏర్పాటుచేసుకొని సాగుగురించి చర్చింకునే అవకాశం కలిగింది. రైతుబంధు కో ఆర్డినేటర్లు అధికారులు, రైతులకు మధ్య అనుసంధానకర్తలా పనిచేస్తున్నారు. దీంతో రైతులు వ్యవసాయ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిం ది. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుండడంతో అభివృద్ధిలో ముందున్నది. దాదాపు రూ.100కోట్లకు పైగా నిధులతో జడ్చర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేశారు.
మినీట్యాంక్‌బండ్‌లు, సీసీ, బీటీ రోడ్లు, రహదారుల విస్తరణ, డ్రైనేజీలు, పార్కులు, పెద్దగుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ధడం వంటి పనుల చేపట్టారు. కావేరమ్మపేట వద్ద ఉన్న నల్ల చెరువును రూ.4కోట్లతో, నల్లకుంటను రూ.2 కోట్లతో మినీ ట్యాంక్ బండ్లుగా తీర్చిదిద్దారు. మన ఊరు-మన బడి కింద పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల సేవలు అందుబాటులోకి రావడంతో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నది. వైకుంఠధామాలు నిర్మించడంతో ఖననం చేసేందుకు ఇబ్బందులు తొలగాయి.
జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, మిడ్జిల్ మండలాల్లో ప్రవహిస్తున్న దుందు భీ వాగుపై దాదాపు రూ.20-30 కోట్లతో చెక్‌డ్యాంలను నిర్మించడంతో భూగర్భజలాలు పెరిగాయి. వాగు పరిసరాల గ్రామాలకు చెందిన రైతులకు పుష్కలంగా నీళ్లు లభిస్తున్నాయి. మిషన్‌భగీరథ ద్వారా గ్రామాల్లో రూ.109కోట్లు, మున్సిపాలిటీలో రూ.60కోట్లతో ఇంటింటికీ నల్లాలను బి గించారు. ఇందుకుగానూ 180 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేశారు. మిడ్జిల్ మండలానికి ఎంజీకేఎల్ఐ ద్వారా సాగునీరందుతున్నది. జడ్చర్లలో రూ. 30కోట్లతో వంద పడకలు, బాలానగర్ మండలకేంద్రంలో 30 పడకల దవాఖానలను నిర్మించారు.
జడ్చర్ల మండలంలోని పెద్ద ఆదిరాలలో పీహెచ్‌సీని ఏర్పాటు చేశారు. పల్లె, పట్టణ ప్రగతితో పల్లెలు, పట్టణాలు సుందరంగా మారాయి. హరితహారం మొక్కలతో ఆహ్లాదం కలుగుతున్నది. పల్లెప్రకృతివనాలు ఏర్పాటు చేయడంతో పల్లె ప్రజలు హాయిగా సేదతీరే అవకాశం లభించింది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకుగానూ ప్రతి జీపీలో ఎకరా స్థలంలో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేయడంతోపాటు క్రీడా సామగ్రిని అందించారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దివ్యాంగులకు సీఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా త్రిచక్రవాహనాలను పంపిణీచేశారు. దాదాపు పదివేల మందికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా గ్రూప్స్కోసం రెండు పర్యాయాలు కోచింగ్ ఇప్పించారు. జడ్చర్ల మండలంలోని పోలెపల్లి సెజ్‌లో పరిశ్రమలు తరలిరావడంతో యువత, నిరుద్యోగులు, స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగాయి. జడ్చర్ల నియోజకవర్గంలో రూ.100కోట్లకు పైగా నిధులతో దాదాపు 2వేల డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి.. అర్హులైన పేదలకు పంపిణీ చేశారు.
అనారోగ్యం బారిన పడి ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న బాధితులకు సీఎం సహాయనిధి కింద ఇప్పటివరకు దాదాపు రూ.70 కోట్లు పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్లకు ఆర్థిక సాయం చేశారు. ఇలా ప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రతి ఇంటికి ఒకటి లేదా రెండు అంతకంటే అందుతున్నాయి. జడ్చర్ల నియోజకవర్గంలో వంద మందికి దళితబంధు కింద రూ.10కోట్ల ఆర్థిక సాయం అందించారు. బీసీబంధు ద్వారా కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్నారు. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న అర్హులకు ప్రొసీడింగ్‌లు పంపిణీ చేశారు.
రూ.కోట్ల నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి..
రూ.300 కోట్లకు పైగా నిధులతో జడ్చర్ల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టారు. 27 వార్డు ల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలను నిర్మిస్తుండగా.. దాదాపుగా 70 శాతం పనులు పూర్తయ్యా యి. అంతర్గత రహదారులు, అండర్‌గ్రౌండ్ డ్రైనే జీ పనులు చేపట్టడంతో అవస్థలు తొలిగిపోయా యి. రూ.40 కోట్లతో 800 డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించారు. రూ.30 కోట్లతో వంద పడకల దవాఖాన, రూ.6 కోట్లతో ఇంటిగ్రేటేడ్ మార్కెట్‌యార్డు, రూ.3 కోట్లతో మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవనం, రూ. 2 కోట్లతో అంబేద్కర్ భవనం, రూ.2 కోట్లతో తాసీల్దార్ కార్యాలయం, భూసార పరీక్ష కేంద్రం, రూ.కోటి తో వ్యవసాయ శాఖ భవనం, రూ.5 కోట్లతో మినీట్యాంక్ బండ్లు నిర్మించారు.
రూ.కోటితో రంగనాయకస్వామి గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. రూ.3 కోట్లతో పార్కుల్లో మౌలిక వసతులు కల్పించారు. 27 వార్డులకుగానూ 17 ఆటోలు, ఏడు ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గ సభ్యులు పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో స్వచ్ఛ మున్సిపాలిటీగా అవార్డును కైవసం చేసుకున్నది. కావేరమ్మపేట వద్ద ఉన్న మినీట్యాంక్‌బండ్‌పై స్ట్రీట్‌లైట్లు, బెంచీలు, వివిధ రకాల మొక్కలు నాటి సుందరంగా ముస్తాబు చేశారు. ‘మన జడ్చర్ల’ లోగో ఏర్పాటు చేయడంతో నూతన శోభ సంతరించుకున్నది.
జడ్చర్ల నడిబొడ్డున్న ఉన్న నల్లకుంట చెరువును మినీట్యాంక్‌బండ్ మార్చే పనులు 70 శాతం పూర్తయ్యాయి. 15 పార్కుల్లో పిల్లలకు ఆటవస్తువులు, యువకుల కోసం ఓపెన్‌జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. రంగనాయక స్వామి గుట్టపైకి వాహనాలు వెళ్లేలా రోడ్ల నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం పార్కు కూడా ఉన్నది. జడ్చర్ల పట్టణంలోని నలుదిక్కులా రోడ్లను విస్తరించడంతోపాటు సెంట్రల్‌లైటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారుల ఇబ్బందులు తొలిగాయి. ప్రధాన కూడళ్లలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, నేతాజీ, సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహాలతోపాటు స్వాతంత్య్ర సమరయోధుల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.
జడ్చర్ల పట్టణంలో శుభకార్యాలు, సభలు, సమావేశాలు జరుపుకునేందుకు అనువుగా అన్ని కులాలకూ కమ్యూనిటీ భవనాలను నిర్మించారు. జడ్చర్ల మున్సిపాలిటీలో రూ.30 కోట్లతో వందపడకల దవాఖానను అందుబాటులోకి తీసుకొచ్చారు. బస్తీ దవాఖానలతో వైద్యసేవలు మరింత చేరువయ్యాయి. రూ.2 కోట్లతో అంబేద్కర్ కళాభవన్ నిర్మించారు. గిరిజన బాలికలకు ప్రత్యేకంగా వసతిగృహాన్ని ప్రారంభించారు. జడ్చర్ల మినీస్టేడియాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. వాకర్ల కోసం ట్రాక్‌తో పాటు ఇండోర్‌స్టేడియం నిర్మించారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో మినీస్టేడియంలో కల్పించిన సదుపాయాలతో క్రీడాకారులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో అన్ని రకాల వసతులు కల్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.