కొల్లాపూర్, ఏప్రిల్ 4 : ప ండ్లల్లో రారా జు.. మామిడి. అయితే మామ మామిడి తోటలకు కేరాఫ్ అడ్రస్‌గా కొల్లాపూర్ నిలిచింది. ఇక్కడి పండ్లకు భలే క్రేజ్. మార్కెట్ ప్రారంభంలోనే ఈ మామిడి అదరగొడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మామి డి దిగుబడి ఈ ఏడాది తగ్గినట్లు కనిపించినా డి మాండ్ మాత్రం తగ్గలేదు. ఇక్కడి మామిడి ద క్కుతున్న ధరను చూసి చెప్పొచ్చు. ఇక్కడి మామిడికి తెలంగాణ రాష్ట్రంలో చా లా ప్రాధాన్యత ఉన్నది. ఇక్క డి నేలకు కొల్లాపూర్ రకం అ నువుగా ఉండటం.. మార్కెట్లోనూ ఆదరణ ఉండటం.. నా ణ్యతలోనూ ప్రత్యేకత ఉండడం తో రైతులు అటువై పే అడుగులు వేస్తున్నారు.
కొల్లాపూర్ మామిడికి విదేశాల్లోనూ గిరాకీ ఉన్నది. ఇప్పటివరకు సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు, అమెరికా, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు ఏజెన్సీల ద్వారా ఎగుమతి అవుతున్నది. దేశంలోని కర్ణాటక, ఢిల్లీ తదితర ప్రాంతాలకు కూడా కొల్లాపూర్ మామిడి ఎక్స్‌పోర్టు అవుతున్నది. వచ్చే రోజు ల్లో కొల్లాపూర్ మామిడికి మంచి భవిష్యత్ ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు భావిస్తున్నారు.
దిగుబడి తగ్గే అవకాశం రాష్ట్రంలోనే మామిడి తోటలకు హబ్‌గా కొల్లాపూర్ నిలిచింది. నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 33523.07 ఎకరాల్లో తోటలు సాగవుతుంటే ఒక్క కొల్లాపూర్ ప్రాంతంలోనే 24,096.59 ఎకరాల్లో తోటలు ఉన్నాయి. సాధారణంగా బాగా కాపుకొచ్చిన తోటల్లో ఎకరాకు 5 నుంచి 7 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది పూత సమయంలో వాతావరణం లో వచ్చిన మార్పులతో కొన్ని ప్రాంతాల్లో దిగుబడి కొంత మేరకు తగ్గే అవకాశం ఉన్నదని మామిడి రైతులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో సగటున 3 నుంచి 4 టన్నులలోపు మాత్రమే దిగుబడి వస్తుందని రైతులు భావిస్తున్నారు.
కొల్లాపూర్ మామిడికి ఉన్న డిమాండ్ ఆధారంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మామిడి రైతుల కోసం సబ్సిడీ కింద మామిడి రైతులకు ఫ్రూట్ బ్యాగింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ పద్ధతి మూలంగా ఇక్కడి మామిడి రైతులకు సిరులను కురిపిస్తోందని చెప్పొచ్చు. ఈ ఏడాది కొల్లాపూర్ డివిజన్ పరిధిలోనే సబ్సిడీ కింద 57 లక్షల 9 వేల మామిడి కవర్లను పంపిణీ చేశారు. మరికొంత మంది రైతులు సొం తంగా కూడా లక్షలాది మామిడి కవర్లను కొనుగోలు చేశారు.
కొల్లాపూర్ ప్రాంతాల్లో పండే బంగినపల్లి మామిడి పండ్లు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. మా మిడి పండ్ల రంగు, రుచితో పాటు బాహ్యరూపంపై మచ్చలు పడకుండా, పురుగులు ఆశించకుండా ఉండేందుకు ప్రవేశపెట్టిన ప్రూట్ బ్యాగింగ్ పద్ధతి అద్భుత ఫలితాలను ఇ చ్చింది. కాయలు పిందె దశలో ఉన్నప్పుడు కవర్లు కట్టడం మూలంగా పక్షుల నుంచి, అతివృష్టి నుంచి, ఈదుర గాలుల నుంచి మచ్చల పురుగు నుంచి రక్షణ లభిస్తుంది. దీంతో పండు బంగారు వర్ణంలో మెరుస్తూ మార్కెట్లో కూడా మామిడికి అధిక ధర లభిస్తుంది.
కొల్లాపూర్ మామిడి అంటే ఒక బ్రాండ్. నాగర్‌కర్నూల్ జిల్లాలో పండే ఈ మామిడి పండ్లకు కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి గుర్తింపు ఉన్నది. మామిడి తోటలకు సహజంగానే నిలయంగా ఉన్న కొల్లాపూర్‌లో ఉద్యానవన పంటలకు ఊపిరి పోసింది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పొచ్చు.
ఇక్కడి మామిడి సాగుకు యోగ్యమైన నేల లు ఉండటంతో పాటు వాతావరణం కూ డా కలిసి వచ్చింది. ‘అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని’ ఉన్నట్లు సాగునీటి వసతి లేకపోవడంతో పాటు తెలంగాణ ప్రాంతంలోని ఉద్యానవన పంటలపై సమాఖ్య పా లన వివక్షత చూపింది. దీంతో కొల్లాపూర్ మామిడికి ఆశించినంతా గుర్తింపు దక్కలేదు. స్వరాష్ట్రం సిద్ధించడంతో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కొల్లాపూర్ మా మిడికి జవసత్వాలు వచ్చాయి. కృష్ణానది నీళ్లు మామిడి తోటలను తడపడవంతో అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయి.
కొల్లాపూర్ మామిడికి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ డిమాండ్ ఉన్నది. మామిడిలో కొల్లాపూర్ మామిడి, కేసరి, హిమాయత్, మల్లిక, దసేరీ, తోతాపురి, మాల్గోవా, నీలం తదితర రకాలున్నాయి. అయితే, కొల్లాపూర్ మామిడిలోనే తీపిదనం, నాణ్యత ఉన్నాయి. సంస్థానాల కాలం నుంచి కూడా వనపర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ ప్రాంతాల్లో మామిడికి ప్రాధాన్యతనిచ్చారు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కో కాయ సైజు 200 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు ఉండటం.. గుండ్రటి ఆకారం, బంగారం, పసుపు మిశ్రమంతో పోలిన రంగులాంటివి ఉంటున్నాయి.
కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో మామిడి దిగుబడి కొంత మేరకు తగ్గినా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. సాధారణంగా తోటలలో దిగుబడి ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతోంది. కానీ ఈ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి నెలలోనే హైదరాబాద్ మార్కెట్‌కు మామిడి కాయలు వెళ్తుంటాయి. ప్రస్తుతం మార్కెట్లో 20 కిలోల బాక్స్ ధర రూ.4 వేలకుపైగా పలుకుతున్నది. ఈ ఏడాది స్వల్పంగా దిగుబడి తగ్గడంతోపాటు, మార్కెట్‌కు ముందుగానే రావడంతో ఇక్కడి మామిడికి ఉన్న ప్రత్యేక రుచి, క్రేజ్ ఉన్నది. అందుకే మార్కెట్లో వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు.
కొల్లాపూర్ మామిడికి ప్రపంచ మార్కెట్లో సైతం మంచి డిమాండ్ ఉన్నది. కొల్లాపూర్‌లోనే అత్యధికంగా మామిడి సాగు అవుతున్నది. కొల్లాపూర్ మామిడి పండ్లు రుచిలో కూడా రారాజుగా ఉన్నాయి. అందుకే ప్రత్యేకంగా ఫ్రూట్ బ్యాగింగ్ పద్ధతిని ప్రోత్సహించడం జరుగుతోంది. దీంతో మామిడి పండు మంచి కలర్లో ఉండటంతో మార్కెట్లో అధిక ధర లభిస్తుంది. రైతులకు సాగు విధానంపై ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం అందింస్తున్నాం. దీంతో మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి.
– లక్ష్మణ్, కొల్లాపూర్ డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి
గత ఏడాదితో పోల్చుకుంటే దిగుబడి గణనీయంగా తగ్గినట్లు కనిసిస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం ఒక బాక్స్ ఆరువేలు పలుకుతోంది. చివరి వరకు ఇదే ధర కొనసాగితే దిగుబడి తగ్గినా పెద్దగా ప్రభావం చూపదు. మార్కెట్లో మామిడి రైతులు దళారుల చేతిలో నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెడితే మామిడి రైతులకు కొంత మేర ఉపశమనం కల్గుతోంది.
– మీనిగ సత్యనారాయణ, మామిడి రైతు