నారాయణపేట, జూన్ 8: గోవులను అ క్రమంగా రవాణా చేసినా, వధించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎ స్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. శనివారం ప ట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులు, పశువైద్యాధికారులు, వీహెచ్ పీ నాయకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో అక్రమంగా పశువులను రవాణా చేసే అవకాశం ఉన్నందునా పోలీసులు, ప శుసంవర్ధ్దక శాఖ అధికారులు సమన్వయం తో పనిచేసి అక్రమ రవాణా, అక్రమ వధ ను అరికట్టాలన్నారు.
కర్ణాటక రాష్ట్రం నుం చి గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా పరిధిలో జిలాల్‌పూర్, కృష్ణ బ్రి డ్జి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నా రు. పోలీసు, పశుసంవర్ధ్దక శాఖ, ఆర్టీవో అధికారులు కలిసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని చెప్పారు. జిల్లాలోని కోస్గి, మ ద్దూర్ పశువుల సంతలో పశువుల రవాణాకు అనుమతి పత్రాలు తనిఖీ చేసి, అనుమతులు లేని వారిపై క్రిమినల్ చర్యలు తీ సుకోవాలన్నారు. పశువులను ఒకచోటు నుంచి మరోచోటుకు తరలించేందుకు పశువైద్యాధికారి ధ్రువీకరణ పత్రం ఉండాలన్నారు.
సంతలో కొనుగోలు చేసిన పశువులను తీసుకొని వస్తున్నట్లయితే వాటిని అ మ్మినవారి వివరాలు, పశువైద్యాధికారి ధ్రు వీకరించిన ఆరోగ్య, రవాణా అనుమతి ప త్రాలు తీసుకోవాలన్నారు. రవాణా సమయంలో పశువులకు హాని తలపెట్టినా, హి ంసించినా, తరలించినా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా రవాణా చేస్తున్నట్లయితే 8712670399 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. బ క్రీద్ పండుగను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ మహేశ్, ఆర్టీవో మేఘాగాం ధీ, సీఐలు శివశంకర్, చంద్రశేఖర్, రాజేందర్‌రెడ్డి, నర్సయ్య పాల్గొన్నారు.