Satish Reddy | శాస్త్రీయ దృక్పథం ద్వారానే సమాజంలో మార్పు : అసిస్టెంట్ ప్రొఫెసర్ బైరెడ్డి సతీష్ రెడ్డి
Satish Reddy | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర విద్యా-వైజ్ఞానిక శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు.
ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU ) తెలంగాణ రాష్ట్ర విద్యా-వైజ్ఞానిక శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బైరెడ్డి సతీష్ రెడ్డి ( Baireddy Satish Reddy ) ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల,మత, ఆర్థిక అసమానతలు, దోపిడీ, పీడన లాంటి రుగ్మతలు పోవాలంటే నేటి విద్యార్థులు , యువత శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. దేశంలోని పౌరులందరూ భౌతిక వాద దృక్పథాన్ని కలిగి ఉండాలని, ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుం దన్నారు.
మూడత్వంతో కూడిన అంథ విశ్వాసాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, లేకపోతే విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత, ఆలోచన శక్తి దెబ్బతింటుందన్నారు. ఇది భవిష్యత్తులో దేశ అభివృద్ధికి అవరోధంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రచన ఎలా చేయాలి,ఉపన్యాసం ఎలా ఇవ్వాలి అనే క్లాసును మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రమ బోధించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి బి. రాము, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోల అనీల్, ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, మునిగల శివప్రశాంత్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు సురేష్, కర్క గణేష్, బోయినపల్లి అజయ్, రాష్ట్ర కోశాధికారి అంగిడి కుమార్, రాష్ట్ర గర్ల్స్ కో-కన్వీనర్ పి. అనూష, రాష్ట్ర నాయకులు సీతారాం, అనిల్, మారుతి, లక్ష్మణ్, అషూర్, హరీష్, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

