అలంపూర్, అక్టోబర్ 5 : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దక్షిణకాశీగా పేరుగాంచిన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో జోగుళాంబ దేవీ శ నివారం చంద్రఘంటా దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గామాతను పూజించడం వ ల్ల దుష్టశక్తులు దూరమై దేవతాశక్తులు ఆరాధకుడి దరి చేరతాయని భక్తుల నమ్మకం. జపమాల, ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పాన పాత్ర త్రిశూలం, ధనస్సు, కమండలం, గద ధరించి మహా లావణ్య శో భతో ప్రకాశించే విధంగా దర్శనమిస్తుంది. ఏర్పాట్లను ఈవో పురేందర్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి, ఆలయ ధర్మకర్త లు పర్యవేక్షించారు.
శ్రీశైలం, అక్టోబర్ 5 : శ్రీశైలం భ్రమరాంబాదేవీ చంద్రఘంటాదేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిపరాశక్తుల్లో తృతీయరూపి ణి అయిన చంద్రఘంటాదేవి యుద్ధోన్ముఖురాలై సింహవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వగా, చంద్రఘంటా సమేతుడైన శ్రీశైలేశుడు రావణ భుజస్కందాలపై విహరి స్తూ భక్త జనాన్ని అలరింపజేశాడని ఈవో పె ద్దిరాజు తెలిపారు. అనంతరం చంద్రఘంటా దేవి సమేతుడైన శ్రీశైలేశుడు రావణ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. క న్నడ జానపదాలు వివిధ రకాల విన్యాసాల తో ఆధ్యాంతం కనులపండువగా సాగింది. ఆలయ దక్షిణ మాడవీధిలో కళారాధన సాం స్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో పీఆర్వో శ్రీనివాసరావు, పర్యవేక్షకు లు అయ్యన్న, హర్యానాయక్, ఉన్నారు.