గద్వాల, సెప్టెంబర్ 25 : జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టుకు ఎగువ నుం చి 72 వేల కూసెక్కులు చేరుతుండగా ఏడు గే ట్లు ఎత్తినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కా గా ప్రస్తుతం 318.350 మీటర్లు, పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 9.316 టీఎంసీలు ఉన్నది. అదేవిధంగా ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 550, భీమా ఫేజ్-1కు 650, ఆర్టీఎస్ లింక్ కెనాల్‌కు 50, విద్యుత్ ఉత్పత్తికి 37,715, మొత్తం 90,161 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో నమోదైంది.
అయిజ, సెప్టెంబర్ 25 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. ఆర్డీఎస్కు ఇన్‌ఫ్లో 9,310, అవుట్ ఫ్లో 8,700 క్యూసెక్కులు నమోదైంది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 610 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆనకట్టలో 9 అడుగుల మేరకు నీటి మట్టం ఉ న్నది. అలాగే తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 7,350, అవుట్‌ఫ్లో 10,119 క్యూసెక్కులు న మోదైంది. 105.788 టీఎంసీల గరిష్ఠ సామ ర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 101.226 టీ ఎంసీల నిల్వ ఉన్నది. 1633 అడుగుల నీటి మ ట్టానికి గానూ 1631.86 అడుగులు ఉన్నది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 15,002 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 12,144 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటి మట్టం 1705 అడుగులకుగానూ 1704.72 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలకు గా నూ, ప్రస్తుతం 128.19 టీఎంసీల నిల్వ ఉన్న ది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 13,332, అవుట్ ఫ్లో 14,307క్యూసెక్కులు నమోదైంది. గరిష్ఠ నీటి మట్టం 1615అడుగులకు గానూ ప్రస్తుతం 1614.93 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 37.64 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 37.59 టీఎంసీలు ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
దేవరకద్ర, సెప్టెంబర్ 25 : కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద చేరుతున్నది. దీంతో బుధవారం ప్రాజెక్టు వద్ద రెండు గేట్లు ఎత్తి 1400 క్యూసెక్కుల నీటిని ఊకచెట్టు వాగులోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ 32.5 అడుగులు ఉన్నది. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుండడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.