వెల్దండ : పుట్టిన ఊరుకు( Hometown ) సేవ చేయడం అదృష్టంగా భావించాలని వెల్దండ మాజీ ఎంపీపీ పుట్టా రాంరెడ్డి ( Putta Ram Reddy ) అన్నారు. నాగర్ కర్నూల్ ( Nagarkurnool ) జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో కరాటే మాస్టర్ నీరటి కుమార్ పర్యవేక్షణలో శిక్షణ ( Training ) పొందిన 52 మంది విద్యార్థులకు బెల్టులు ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఆత్మ రక్షణ కోసం కరాటే ఎంతో అవసరం ఉందన్నారు. మాస్టర్ కుమార్ తన సొంత ఖర్చులతో పురిటి గడ్డ రుణం తీర్చుకునే దిశగా ఉచితంగా కరాటే నేర్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలస్వామి, మాజీ ఎంపీటీసీ రాములు, మార్షల్ ఆర్ట్స్ కరాటే గౌరవ అధ్యక్షుడు నాగరాజు గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు జోగయ్య, గండికోట రాజు, గ్రామస్థులు ఆంజనేయులు , కర్ణాకర్ రావు, రాజు చారి, కృష్ణ, అశోక్, మల్లేష్, శ్రీను విద్యార్థులు ఉన్నారు.