మహ్మదాబాద్, అక్టోబర్ 6 : భూత్పూరు నుంచి చించోళి వరకు 167 నేషనల్ హైవే విస్తరణలో భాగంగా మహ్మదాబాద్లో రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైనేజీ నిర్మించారు. మహ్మదాబాద్ గ్రామంలోకి వెళ్లే ముఖ్య రహదారి పక్కన శనివారం రాత్రి డ్రైనేజీ కుంగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా, వాహనాలను సర్వీస్ రోడ్లపై నుంచి మళ్లిస్తున్నారు. దీంతో మెయిన్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్డుకు వెళ్లాలంటే సైడ్ డ్రైనేజీపై నుంచే వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. ఐదారు రోజుల నుంచి తాండూరు, మహబుబ్నగర్ వెళ్లే భారీ వాహనాలు సైడ్ డ్రైనేజీపై నుంచి వెళ్లడంతో డ్రైనేజీ కుంగిపోయి ఇనుప చువ్వ లు విరిగిపోయాయి.