గండీడ్, డిసెంబర్ 12 : మండలంలోని రుసుంపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వపరిపాలనా దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా జరుపుకొన్నారు.
ఈ సం దర్భంగా పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠ్యాంశాలను బోధించారు. ఎంఈవోగా విష్ణువర్ధన్, హెచ్ఎంగా అక్షిత వ్యవహరించారు. కార్యక్రమం లో హెచ్ఎం సేవ్యా, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు కృష్ణయ్య, సికీందర్, తుకారం పాల్గొన్నారు.