బ్రహ్మాండనాయకుడి వేడుకకు వేళాయే..
స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10గంటలకు పుణ్యహవచనం, అంకురారోహణంతో ప్రారంభంకానున్నాయి. 11గంటలకు ధ్వజారోహణం, భేరీపూజ, హోమాలు నిర్వహిస్తారు.
- నేటినుంచి సంతాన వేణుగోపాలస్వామి ఉత్సవాలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
గద్వాలటౌన్, డిసెంబర్ 13: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా.. కొలిచిన వారికి కొంగుబంగారంగా గద్వాలలోని భీంనగర్‌లో కొలువైన సంతాన వేణుగోపాలస్వామి భక్తులతో నిత్యపూజలు అందుకుంటున్నాడు. ఆ పక్కనే స్వయంభూగా వెలిసిన హయగ్రీవ స్వామివారు నిత్యం భక్తులతో అఖండ పూజలు అందుకుంటున్నాడు. దీంతో ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకున్నది. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను సంస్థాన కాలం నుంచి వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలనే గద్వాల చిన్నజాతర అనికూడా పిలుస్తారు. నాటి ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా మూడురోజులపాటు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా నిర్వాహకులు అన్నిఏర్పాట్లు చేపట్టారు.
గద్వాల చిన్న జాతర
స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని భీంనగర్‌లో జాతర ఏర్పాటవుతున్నది. ఈ జాతరను గద్వాల చిన్నజాతర, భీంనగర్ జాతర అని పిలుస్తారు. ఈ జాతర సందర్భంగా పెద్దఎత్తున్న అంగళ్లు, రంగురాట్నాలు, సర్కస్‌లు వెలుస్తాయి. ముఖ్యంగా జాతరకు ప్రత్యేకంగా మాంసం అంగళ్లు ఎక్కువగా వెలుస్తాయి. జాతర దాదాపు నెలరోజులపాటు సాగనున్నది.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు పూర్తి
స్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10గంటలకు పుణ్యహవచనం, అంకురారోహణంతో ప్రారంభంకానున్నాయి. 11గంటలకు ధ్వజారోహణం, భేరీపూజ, హోమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గురువారం ఉదయం 10గంటలకు నిత్యహోమం, రాత్రి 8గంటలకు రథోత్సవం, స్వామివారిసేవ, ఊరేగింపు ఉంటుంది. శుక్రవారం ఉదయం10 గంటలకు పారువేట, 3గంటలకు తీర్థావళి, నాగవల్లి, పూర్నాహుతి దేవతా విసర్జనలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు బోరవెల్లి పవన్‌కుమర్, రాఘవచారి తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

