మహబూబ్‌నగర్ అర్బన్, మా ర్చి 1: ఆర్టీసీకి మహాశివరాత్రి సం దర్భంగా ఆశించిన స్థాయిలో అదనపు ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఆర్ఎం సంతోష్‌కుమార్ శనివా రం ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవ రి 24 నుంచి 27 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 271 బస్సులను శ్రీశైలం రూట్లో నడిపి 54వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో ఆర్టీసీ సంస్థకు రూ.88.98 లక్షల అదనపు ఆ దాయం వచ్చిందని ఆర్ఎం తెలిపారు. అచ్చంపేట నుంచి రూ.9. 097 లక్షలు, గద్వాల రూ.7.62, కల్వకుర్తి రూ.6.91, కొల్లాపూర్ రూ.7.47, మహబూబ్‌నగర్ రూ. 24.51, నాగర్‌కర్నూల్ రూ.8. 97, నారాయణపేట రూ.9.53, షాద్‌నగర్ రూ.4.48, వనపర్తి రూ.10.37 లక్షల రాబడి వచ్చిన ట్లు వెల్లడించారు.