కల్వకుర్తి, నవంబర్ 24 : కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి మరణ వాంగ్మూలం నోట్ ఆధారంగా నిందితుల కాలమ్‌లో రేవంత్‌రెడ్డి సోదరుల పేర్లు చేర్చుతూ బీఎన్ఎస్ 108 సెక్షన్‌తోపాటు పీడీ యాక్ట్ నమోదు చేయాలని, ఈ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ఆదివారం కల్వకుర్తి ప్రభుత్వ కమ్యూనిటీ దవాఖాన మార్చురీలో సాయిరెడ్డి పార్థ్థివదేహంపై ఆర్ఎస్పీ పూలమాల ఉంచి నివాళులర్పించారు. అనంతరం సాయిరెడ్డి చిన్న కుమారుడు మాధవరెడ్డికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దవాఖాన ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సాయిరెడ్డి మర ణ వాంగ్మూలం నోట్‌ను పక్కనబెట్టి సీఎం సోదరులపై ఈగ వాలకుండా కొమ్ము కాస్తున్న పోలీస్ అధికారులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుల తీరుతో అవమాన భారానికి గురై 85 ఏండ్ల వృద్ధుడు సాయిరెడ్డి పురుగుల మం దు తాగి ఆత్మహత్య చేసుకుంటే.. నిందితుల కాలమ్ ఖాళీగా ఉంచి 108 బీఎన్ఎస్ సెక్షన్ ఊసే లేకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందని మండిపడ్డారు. తాను కూడా పోలీస్ అధికారిగా పనిచేశానని, చట్టం గురించి క్షుణ్ణంగా తెలుసునని, ఒక వ్యక్తి మరణ వాంగ్మూలం లేఖలో పేర్లు రాస్తే 108 బీఎన్ఎస్ సెక్షన్ నమోదు చేసి విచారణ చేయాల్సి ఉంటుందన్నారు.
సాయిరెడ్డి నోట్‌ను పోలీసులు మాయం చేసి.. 108 బీఎన్ఎస్ సెక్షన్‌ను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రాజ్యాంగానికి, భారత న్యాయ సంహితకు విధేయత చూపాలి కానీ.. సీఎం, వారి కుటుంబ సభ్యులు, సోదరులకు కాదని హితవు పలికారు. రాష్ట్రంలో పోలీసుల తీరు ద్వంద వైఖరికి నిదర్శనంగా ఉందన్నారు. మరణ వాం గ్మూలం లేఖ తమ వద్ద లేదని పోలీసులు బుకాయిస్తున్నారని.., అలాంటప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న లేఖ ఆధారంగానైనా కేసు నమోదు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు.
అదే సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు ఆధారంగా రైతుల పక్షాన పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని పార్క్‌లో జాగింగ్ చేస్తున్నప్పుడు బీఎన్ఎస్ 354, ఐటీ 67 సెక్షన్ కింద అరెస్ట్ చేయలేదా అంటూ దుయ్యబట్టారు. సీఎం కుటుంబానికి ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయమా అని పేర్కొన్నారు. సాయిరెడ్డి నోట్ పోలీసుల వద్దే ఉంచుకొని.. లేదంటూ కట్టుకథలు అల్లుతున్నారన్నారు. చిన్న చిన్న కేసుల్లో అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులు సాయిరెడ్డి విషయంలో 108 బీఎన్ఎస్ సెక్షన్ నమోదు చేయడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు.
మరణ వాంగ్మూ లం నోట్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపించామని చెబుతూ నే నిందితులను తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతున్నదన్నారు. సాయిరెడ్డి ఆత్మహత్య విషయంలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆరేండ్లకు వస్తుందని, ఆ రిపోర్టు వచ్చిన తర్వాత 108 సెక్షన్ నమోదు చేసి విచారణ చేసే సమయానికి ఉండేదెవడో పోయేదెవడో అని ఎద్దేవా చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు పోలీసులు నిందితుల కాలమ్‌లో బీఎన్ఎస్ 108 సెక్షన్‌ను చేర్చి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియంతృత్వ, రాచరిక అనవాళ్లు కనిపిస్తున్నాయని, ప్రశ్నిం చే గొంతుకలను, అన్యాయాలను ఎదురించే వారిని నిర్భందించడం, కేసులు నమోదు చేయడం సర్వసాధారణంగా మారిందన్నారు. రైతులను అష్టకష్టాలు పెడుతూనే భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మం డిపడ్డారు. సీఎం సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారి రాచరిక పోకడలు సాగిస్తున్నారని. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి ఆత్మహత్యే అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ హక్కులుంటాయని, వాటిని కాపాడేందుకు ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌యాదవ్, విజయ్‌గౌడ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
వెల్దండ, నవంబర్ 24 : కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. వెల్దండ మండల కేంద్రంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కొండారెడ్డిపల్లి గ్రామానికి 13ఏండ్ల్లు సుదీర్ఘ సేవలు అందించిన సాయిరెడ్డిని క్షోభకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన రేవంత్‌రెడ్డి సోదరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 85ఏండ్ల్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో కాం గ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్టారాంరెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ శేఖర్ నాయకులు యాదగిరి, అశోక్, ఆర్కెగౌడ్, శ్రీను, జోగయ్య, వెంకట్‌రెడ్డి, ఆనంద్, హన్మంతు, లింగం, సాజ్యా, రాజు మాజీ ఉప సర్పంచులు నిరంజన్, నర్సింహ తదితరులు ఉన్నారు.