భూత్పూర్, జనవరి 8 : ఇటీవల చేపట్టిన భూత్పూర్-వెల్కిచర్ల రోడ్డు నిర్మాణ పనులు డబుల్ స్పీడ్‌తో పూర్తయ్యాయి. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూత్పూర్ నుంచి వెల్కిచర్ల వరకు రోడ్డు మొత్తం గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. రోడ్డు నిర్మాణ విషయాన్ని వెల్కిచర్ల, భట్టుపలి, మద్దిగట్ల, కొత్తమొల్గర, పాతమొల్గర, కప్పెట, గోప్లాపూర్ గ్రామాల ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
ఇటీవల ఎమ్మెల్యే ఆలకు సమస్యను తెలియజేయడంతో రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. 12కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.11కోట్లను మంజూరు చేయించి పనులను ప్రారంభించారు. అయితే భూత్పూర్ నుంచి గోప్లాపూర్ మధ్యలో రోడ్డు విస్తరణతో భూములను నష్టపోతున్నామని, తమకు పరిహారం ఇవ్వాలని కొందరు కోర్టులో కేసు వేశారు. దీంతో రోడ్డు పనుల్లో కొంత జాప్యం జరిగింది. దీనిపై ఎమ్మెల్యే ఆల స్పందించి రైతులకు నచ్చజెప్పారు. కోర్టు తీర్పు మేరకు నష్టపరిహారం వస్తుందని, రోడ్డు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఆయా గ్రామాల ప్రజలతోపాటు వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తీవ్ర ఇబ్బందులు పడినం
వెల్కిచర్ల నుంచి భూత్పూర్ వరకు రోడ్డు మొత్తం గుంతలమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడినం. దివ్యాంగులు త్రీచక్రవాహనంపై వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి ఉండేది. కొత్తగా రోడ్డు విస్తరణ పనులను చేపట్టి పూర్తి చేయ డం సంతోషంగా ఉంది. పనులు ప్రారంభించిన మూడునెలల్లోనే పూర్తి చేయడం చాలా గొప్ప విషయం.
– నాగన్న, వెల్కిచర్ల
ఎమ్మెల్యే ఆల కృషి మరవలేనిది
భూత్పూర్ నుంచి వెల్కిచర్ల వరకు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చేసిన కృషి మరవలేనిది. రోడ్డు నిర్మాణానికి రూ.11కోట్లను మంజూరు చేయించడంతోపాటు దగ్గరుండి పనులను పూర్తి చేయించారు. ఎమ్మెల్యే పట్టించుకోకుంటే పనులు పూర్తయ్యేవి కాదు. రోడ్డు సమస్యను పరిష్కరించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– సభావట్ ఆంజనేయులు, సర్పంచ్, భట్టుపల్లి
నిరంతరం పర్యవేక్షణ
రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు నిరంతరం పర్యవేక్షించాం. పనుల్లో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకు న్నాం. ఎమ్మెల్యే ఆల ప్రత్యే క చొరవ చూపడం, కాం ట్రాక్టర్ శ్రద్ధతో పనులను త్వరగా పూర్తిచేశాం. ఇం దుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు.
– వేణుగోపాల్, ఆర్అండ్బీ ఏఈ