మక్తల్, మార్చి 27 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భా గంగా భూసేకరణ చేస్తున్న అధికారులు భూ ములు పోయే రైతులకు నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన అధికారులకు రైతులెవ్వరూ నోటీసులు తీసుకోకపోవడంతో అధికారులకు చే దు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూమిని కోల్పోతున్న మక్తల్ మండ లం కాట్రేపల్లి గ్రామంలో ప్రధాన పంప్‌హౌస్ నిర్మాణం కోసం 49మంది రైతులకు సంబంధించిన 64ఎకరాలకు రెవెన్యూ అధికారులు ఏ ఏ రైతు ఎంత భూమి కోల్పోతున్నాడని నోటీసులు ఇవ్వడానికి గ్రామానికి వెళ్లారు.
మక్తల్ ఆర్ఐలు రాములు, భూపాల్‌రెడ్డిలు భూమిని కోల్పోతున్న రైతులకు నోటీసులు ఇవ్వడానికి వెళ్లగా, ఒకరిద్దరు రైతులు మాత్రమే వారికి అవి ఏవో తెలియకుండా నోటీసులు తీసుకున్నారు తప్పా, మిగతా రైతులెవరూ రెవెన్యూ అధికారులు అందించే నోటీసులను తీసుకోకుండా తిరసరించారు. అధికారులు ఏం చేయాలో తెలియ క, ఎర్నాగానిపల్లి, కాట్రేవుపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నా రాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతుల వివరాలతో కూడిన నోటీసును అతికించి మమ అనిపించుకొని తిరుగు మొఖం పట్టారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన వైఖరి వచ్చేంతవరకు నోటీసులు కాదు కదా, రెవెన్యూ అధికారుల నుంచి ఏ ఒక కాగితాన్ని తీసుకోమని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత వారం రోజుల కిందట మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎత్తిపోతల పథకంలో భూముల కోల్పోతున్న కాట్రేపల్లి గ్రామ రైతుల వివరాలతో కూడిన సంతకాలు తీసుకొని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్‌లో చేపట్టబోయే ఐటీ కారిడార్‌కు ఏ విధంగా భూములను సేకరించి నష్టపరిహారం చెల్లిస్తున్నారో, లగచర్ల రైతులకు ప్రభు త్వం అందించే నష్టపరిహారాన్ని మక్తల్ మం డలం కాట్రేపల్లి, ఎర్నాగానిపల్లి, బాపూర్ గ్రామాల రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చే విధంగా గట్టిగా కొట్లాడుతానని రైతులకు హామీ ఇచ్చారని రైతులు పేరొన్నారు.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కానీ నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఏ మాదిరిగా నష్టపరిహారం చెల్లిస్తుంది అని స్పష్టమైన వైఖరి ఏ ఒకరు చెప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మక్తల్ రెవెన్యూ అధికారు లు మాత్రం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు కో ల్పోతున్నటువంటి కాట్రేవుపల్లి గ్రామానికి చెందిన 49మంది రైతులకు సంబంధించి 64ఎకరాలకు నోటీసులు జారీ చేయాలని చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు ఏ ఒక నోటీసు లు ముట్టమని రైతులు పేర్కొంటున్నారు.