వంగూరు, జూన్ 13 : ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిన వెంటనే చేపట్టిన రెవెన్యూ సదస్సులు రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. కేవలం తూతూ మంత్రంగానే సదస్సులు నిర్వహిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. కేవలం పెద్ద రై తులకు మాత్రమే ఉపయోగపడే భూభారతితో రెవెన్యూ సదస్సులు ఎందుకం టూ రైతులు ప్రశ్నిస్తున్నారు.
మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో శుక్రవా రం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అధికారులు తమ దరఖాస్తులు తీసుకోవడం లేదని రైతులు వాపొయారు. ఎన్నో ఏండ్లుగా పొలం సాగు చేస్తున్నప్పటికీ పట్టా లేకపోవడంతో సదస్సుకు వచ్చి దరఖాస్తు ఇస్తే అధికారులు తీసుకోవడం లేదని రై తులు మండిపడుతున్నారు. భూభారతితో పెద్ద రైతులకే న్యాయం జరుగుతుందని పేద రైతులకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదని రైతు జంగయ్య ఆరోపించారు. ప్రభు త్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో వందలో 10శాతం మాత్రమే పరిష్కారం అవుతున్నాయే తప్పా 90 శాతం సమస్య లు పరిష్కారం కావడం లేదని మరో రైతు రాజు పేర్కొన్నారు.