కొల్లాపూర్ : పట్టణ మున్సిపల్‌కు చెందిన 19 వార్డుల రిజర్వేషన్లను ( Reservation ) అధికారులు ఖరారు చేశారు. శనివారం సాయంత్రం నాగర్ కర్నూల్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ( Collector Santosh ) , అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లాలోని మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు.
కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలో 19 వార్డులకు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
19 వార్డుల రిజర్వేషన్లు
1వ వార్డు ( జనరల్ ఉమెన్)
2వ వార్డు ( జనరల్ అన్ రిజర్వ్డ్ ఉమెన్)
3వ వార్డు ( ఎస్సీ ఉమెన్)
4 వ వార్డు ( జనరల్)
5వ వార్డు ( జనరల్ )
6వ వార్డు ( బీసీ ఉమెన్ )
7వ వార్డు ( బీసీ ఉమెన్ )
8వ వార్డు ( బీసీ జనరల్ )
9వ వార్డు ( బీసీ జనరల్ )
10వ వార్డు ( ఎస్సీ జనరల్ )
11వ వార్డు ( జనరల్ ఉమెన్)
12వ వార్డు ( బీసీ జనరల్ )
13వ వార్డు ( జనరల్ ఉమెన్)
14వ వార్డు ( జనరల్ )
15వ వార్డు ( ఎస్టీ జనరల్ )
16వ వార్డు ( జనరల్)
17వ వార్డు ( ఎస్సీ జనరల్ )
18వ వార్డు ( జనరల్ ఉమెన్ )
19వ వార్డు ( జనరల్ ఉమెన్ )
అధికారికంగా ధ్రువీకరించిన సమాచారాన్ని తరువా విడుదల చేస్తామని, ప్రాథమిక ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్లను విడుదల చేసినట్లు వివరించారు.