అచ్చంపేట, ఏప్రిల్ 26: దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో సహాయక చర్యలు ఆగుతూ.. సాగుతున్నాయి. టన్నెల్లో ప్రమాదం జరిగి శనివారం నాటికి 64వ రోజుకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర 12 విభాగాలకు చెందిన రెస్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నా రు. టన్నెల్లో చిక్కుకున్న మిగిలిన ఆరుగురి మృతదేహాలు లభించకపోవడం, డేంజర్ జోన్లో సహాయక చర్యలు ఆగిపోవడంతో చేసేదిలేక చాలామంది తిరిగి వెళ్లిపోయారు.
ప్రస్తుతం టన్నెల్లో కేవలం రైల్యే, హైడ్రా, ఎ స్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. సింగరేణి మైన్స్ రెస్క్యూ సిబ్బంది 39మంది శనివారం ఉదయం తిరిగి వెళ్లిపోయారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ర్యాట్‌హోల్ మైనర్స్ వెళ్లిపోయారు. ప్రస్తుతం మూడు విభాగాల వారిలో దాదాపు 100-120 మంది వరకు ఉంటారు. ప్రస్తుతం అక్కడున్నది హైడ్రా, రైల్యే, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి ట న్నెల్ లోపల చేసేందుకు ఎలాంటి పనులు లేక ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
టన్నెల్ లోపల ఉ బికి వస్తున్న నీటిని నిరంతరం డీవాటరింగ్ చేస్తున్నారు. సహాయక సిబ్బంది చేసేందుకు లోపల ఎలాంటి పనులు లేక లోపలికి వెళ్లి మళ్లీఏమైనా లికేజీలు ఉన్నాయా? అం టూ చూసి వస్తున్నారు. టన్నెల్ లోపల మొత్తం పేరుకుపోయిన శిథిలాలు, బండరాళ్లు, కూలీపడిన సిమెంట్ సె గ్మెంట్లు 3, మట్టి, బురద, స్టీల్ మొత్తం బయటకు తరలించి 281 మీటర్ల వరకు సహాయక చర్యలు పూర్తి చే శారు. మిగిలిన 43మీటర్లు డేంజర్ జోన్ అంటూ బోర్డు, కంచె ఏర్పాటు చేశారు.
నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు, జీఎన్ఐ నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం అక్కడ సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రభుత్వం నియమించిన టెక్నికల్ కమిటీ సభ్యులు ఎన్ఐఆర్ఎం చీఫ్ శాస్త్రవేత్త మైతానీ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్, అవుట్‌లెట్‌ను పరిశీలించారు. టన్నెల్ అవుట్లెట్ వద్ద పనులు ప్రారంభించేందుకు పరిశీలించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లేందుకు తీసుకునే చర్యల గురించి అధ్యయనం చేసేందుకు పరిశీలించారు.
ఆయన టెక్నికల్ కమిటీకి నివేదిక ఇవ్వనున్నా రు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని శనివారం కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివా రం ప్రకటనలో తెలిపారు. డీవాటరింగ్ ప్రక్రియ, టీబీఎం శిథిలాల తొలగింపు, కన్వేయర్ బెల్టుతో మట్టి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని, సాంకేతిక కమిటీ సూచనల మేరకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సహాయక బృందాలు తప్పా మిగిలిన అన్ని సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.
చర్యల్లో ప్రభుత్వం విఫలం : నిరంజన్‌రెడ్డి
ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన చర్యల్లో కాంగ్రెస్ ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అర్థాంతరంగా సహాయక చర్యలను విరమించుకోవడం, మరో ఆరుగురు కార్మికుల మృతదేహాల ను బయటకు తీయకుండా ముగించడం బాధాకరమన్నారు. చర్యలపై ఎలాంటి సమీక్ష లేకుండా హ డావుడిగా సహాయక చర్యలను నిలిపి వేయడం దా రుణమన్నారు. హెలీక్యాప్టర్‌లో తిరిగి, చేపల కూ రలు తిని హంగామా చేశారే తప్పా మరొకటి లేదన్నారు.
మంత్రులు, సీఎం సహాయక చర్యలు నిలిపి వేస్తున్నామని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించా రు. కేవలం ఇద్దరి మృతదేహాలను మాత్రమే బయట కు తీసి 63రోజుల తర్వాత మిగిలిన వారిని గుర్తించకుండా చేతులెత్తేశారన్నారు. కనీసం చివరి చూపున కు కూడా కార్మికుల కుటుంబాలకు దక్కనీయలేదని, ఇంతటి దయనీయ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాద సహాయ చర్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.