SLBC Tunnel Mishap | మహబూబ్ నగర్ : దోమలపెంట , శ్రీశైలం సమీపంలో సొరంగంలో పైకప్పు కూలిపోయిన తర్వాత లోపల చిక్కుకున్న వారిని రక్షించడానికి భారత సైన్యం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం కలుగుతుంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగం పైకప్పు యొక్క ఒక భాగం కూలిపోయిన ఘటనపై అధికారులు ఇచ్చిన సమాచారంతో ఓ బ్లూప్రింట్ తయారు చేశారు.
ఈ సంఘటనలో కార్మికులు లోపల చిక్కుకున్నట్లు భావిస్తున్న ప్రదేశాన్ని పాయింట్ ఔట్ చేశారు. ఇక్కడ నుంచి రెస్క్యూ ఆపరేషన్ ఏవిధంగా ఉండాలనే దానిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి రంగంలోకి దిగారు. స్విఫ్ట్ రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి..
తెలంగాణ -ఆంధ్రా సబ్ ఏరియా రెస్క్యూ ఆపరేషన్లను సమన్వయం చేస్తుందని అధికార యంత్రాంగం ప్రకటించింది. సికింద్రాబాద్ నుండి బైసన్ డివిజన్ ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ (ETF) మోహరించారు. అధిక సామర్థ్యం గల పంపింగ్ సెట్లు, సాయుధ గొట్టాలు, ఎక్స్కావేటర్లు, జేసీబీ, బుల్డోజర్లతో కూడిన ఆర్మీ వైద్య బృందాలు, ఇంజనీర్లు శిధిలాలను తొలగించే పనిని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన చోట తొలగింపు ప్రక్రియ ప్రారంభం అయిందని ఉన్నతాదికారి ఒకరు తెలిపారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఎన్డీఆర్ఎఫ్, ఏస్డీఆర్ఎఫ్ సైన్యం సొరంగం నిర్మాణ కాంట్రాక్టర్లతో కలిసి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు.
రంగంలోకి దిగిన భారత సైన్యం సహాయక చర్యలను వేగవంతం చేయడంతో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా వెలికితీయడం భారత సైన్యానికి సవాల్‌గా మారింది.
Group-2 Mains | ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం
Gurukul Entrance Test | హాల్ టికెట్ ఉన్నా.. గురుకుల పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరణ
Woman Suicide | ఏడాది క్రితం ప్రేమ వివాహం.. రామంతపూర్‌లో గృహిణి ఆత్మహత్య