మహబూబ్నగర్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నారాయణపేట మండలం పేరపళ్ల భూముల రీ సర్వే వ్యవహారం ప్రసు తం చర్చనీయాంశంగా మారింది. భూముల రీ సర్వేకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించేందుకు అధికారులు వెనుకంజ వే స్తున్నారు. రీ సర్వే ప్రక్రియలో అసలు పరిస్థి తి ఏమిటన్నది స్పష్టంగా తెలియకపోవడం తో స్థానికుల్లోనూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీ సర్వేలో భాగంగా నేటి నుంచి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సర్వే ప్రారంభం కానుంది.
ఇందుకోసం అధికారులు మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశా రు. ఇందులో మూడు టీంలు ఫీల్డుకు వెళ్లనుండగా మరో టీమ్ రిజర్వులో ఉంటుంది. ఆయా బృందాలు భూముల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో వివరాలను పరిశీలించి, రికార్డుల తో సరిపోల్చనున్నాయి. ఫీల్డ్ సర్వేకు ముం దు సంబంధిత అధికారులతో గురువారం ఆర్డీవో సమీక్ష నిర్వహించారు. సర్వే ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూముల వివరాల పరిశీలన, రికార్డుల ధ్రువీకరణ తదితర అంశాలపై బృందాలకు సూచనలు చేసినట్లు సమాచారం.
విలేకరులను చూసి తలుపుల మూత..
ఇదిలా ఉండగా, రీ సర్వేకు సంబంధించిన వి వరాలు తెలుసుకునేందుకు విలేకరులు అధికారులను సంప్రదించగా కొందరు అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణ లు ఉన్నాయి. విలేకరులు కార్యాలయానికి వచ్చిన సమయంలో తలుపులు మూసుకోవడం, వివరాలపై మాట్లాడేందుకు నిరాకరించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత కనీసం ఫొటో తీసుకుంటామని చెప్పి పంపించగా అందుకు కేవలం ముగ్గురు విలేకరులకు లోపలికి వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. సమావేశం అనంతరం బయటకు వచ్చిన ఆర్డీవో రేపటి నుంచి సర్వే చేపడుతున్నామని, ఇందుకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఎవరు ఆదేశించారని అడగగా అందుకు మాట దాటేస్తూ వెళ్లిపోయారు.
దాగుడు మూతలు..
రీ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగినప్పుడు అధికారులు ఆ వివరాలు మా వద్ద లేవు, ఇతర అధికారులను అడగాలి అంటూ ఒకరిపై ఒకరు బాధ్యతను నెట్టివేసుకుంటు వచ్చారు. దీంతో అసలు రీ సర్వే ఉద్దే శం ఏమిటీ? ఎన్ని ఎకరాల భూములు సర్వే పరిధిలోకి వస్తాయి? రికార్డుల్లో ఏమైనా తే డాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేపటి నుంచి ఫీల్డ్ సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో నాలుగు బృందాలు ఏ విధంగా సర్వే నిర్వహిస్తాయి, భూ య జమానుల నుంచి ఎలాంటి వివరాలు సేకరిస్తాయి, సర్వే అనంతరం ఎలాం టి నివేదిక రూపొందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అధికారులు పారదర్శకంగా పూ ర్తి వివరాలను వెల్లడించి, రీ సర్వే ప్రక్రియపై నెలకొన్న అనుమానాలకు తెరదించాలని స్థానికులు కో రుతున్నారు.