మానవపాడు, జనవరి 25 : ఆర్డీఎస్ కెనాల్ ద్వారా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన షట్టర్ లాక్స్ రాడ్లను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఈఈ విజయ్‌కుమార్ తెలిపారు. ఆర్డీఎస్ కాల్వకు కొన్నిరోజులుగా నీటి సరఫరా జరగలేదు. రైతులకు సాగునీరు అందించాలని ఉద్దేశ్యంతో మూడురోజులుగా వారబంధిగా నీటి సరఫరా పునరుద్ధరించారు.
శుక్రవారం రాత్రి నుంచి 29వ డిస్ట్రిబ్యూటరీకి నీటి సరఫరా నిలిపివేసి 30వ డిస్ట్రిబ్యూటరీకి నీటిని విడుదల చేశారు. అయితే ఈ క్రమంలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు 29, 30వ డిస్ట్రిబ్యూటరీలకు చెందిన గేర్ లాక్స్, రాడ్లను చోరీ చేశారన్నారు. దీనిపై మానవపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఈఈ తెలిపారు.