మక్తల్, మార్చి 31: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందజేయాల్సిన సన్నబియ్యం స్టాక్ పాయింట్‌కు చేరకముందే పకదారి పడుతున్న ఘటన మంగళవారం మక్తల్ మున్సిపాలిటీలోని సివిల్ సైప్లె స్టాక్ పాయింట్ వద్ద చోటు చేసుకున్నది. అధికారుల కనుసన్నలోనే స్టాక్ పాయింట్ చేరుకోవాల్సిన బియ్యాన్ని బ్లాక్ మారెట్‌కు తరలిస్తూ పేదల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే మక్తల్ మండలంలోని రుద్ర సముద్రం గ్రామం వద్ద సివిల్ సైప్లె స్టాక్ పాయింట్ నుంచి లారీలో మక్తల్ స్టాక్ పాయింట్‌కు రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చిన లారీ డ్రైవర్ ఉదయం 6గంటల సమయంలో మక్తల్ నెహ్రూగంజ్లోని స్టాక్ పాయింట్ వద్దనే రేషన్ బియ్యాన్ని తీసి ప్రైవేట్ ఆటోలో తరలించి లారీని నర్వ మండల కేంద్రంలోని షాప్ నెంబర్ మూడుకు తరలించినట్లు సమాచారం.
పశ్చిమాసియా దేశాలలో యుద్ధం కారణంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఒకేసారి మూడునెలల రేషన్ బియ్యాన్ని అందజేయాలని స్టాక్ పాయింట్లకు పంపిస్తున్నది. అయితే సివిల్ సైప్లె అధికారులు, లారీ డ్రైవర్ల లోపాయికారి ఒప్పందాలతో మధ్యవర్తుల చేతుల్లోకి జారిపోతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మక్తల్ నియోజకవర్గంలో మక్తల్, కృష్ణ, ఊటూర్, నర్వ, మాగనూర్, మం డలాల్లోని రేషన్ షాపులకు మక్తల్ స్టాక్ పాయింట్ నుంచి బియ్యాన్ని తరలిస్తున్న అధికారులు పూర్తిస్థాయిలో ప ర్యవేక్షణ లోపించడం వల్లనే ఇలాంటి చర్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత శా ఖ అధికారులు బ్లాక్ మారెట్‌కు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూ డాల్సిందే. ఈ ఘటనపై మక్తల్ సివిల్ సైప్లె స్టాక్ పాయింట్ డిప్యూటీ తాసీల్దార్ జనార్దన్‌గౌడ్‌ను వివరణ కోరగా కొంతకాలంగా స్టాక్ పాయింట్‌కు బియ్యాన్ని రవాణా చేస్తున్న లారీ డ్రైవర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, తమ దృష్టికి ఇదివరకే వచ్చిందని, ఇకముందు ఇలాంటి చర్యలు ఉత్పన్నం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, సంబంధిత రవాణా కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లి, ఆ లారీలను తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.