నాగర్‌కర్నూల్, జూలై 9 : ఎట్టకేలకు గుడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లు చేరుకున్నాయి. కేఎల్ఐ అధికారులు రెండు మోటర్లను ప్రారంభించి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ఆదివారం రాత్రి మొదటి మోటర్‌ను ప్రారంభించగా, ఎగువ ప్రాంతం నుంచి జొన్నలబొగుడకు నీటి ఉధృతి పెరగడంతో అక్కడి నుంచి రెండు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడంతో గుడిపల్లి చేరుకుంటున్నాయి. మంగళవారం సైతం గుడిపల్లి వద్ద రెండో మోటర్‌ను ప్రారంభించి నీటిని రిజర్వాయర్‌లోకి వదులుతున్నారు. రిజర్వాయర్‌ను నిండిన తర్వాత కాల్వల ద్వారా చెరువులకు సరఫరా చేయనున్నట్లు కేఎల్ఐ డీఈ భద్రయ్య వెల్లడించారు. వర్షాకాలం కావడంతో జూరాలకు స్వల్పంగా నీరు వస్తుండడంతో ముందస్తుగా గుడిపల్లి రిజర్వాయర్‌ను నింపుతున్నారు.