నవాబ్‌పేట, జూన్ 6 : మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. బడిబయటి పిల్లల్ని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ఉపాధ్యాయులు చర్య లు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. మండలంలోని ఇప్పటూర్‌లో గురువారం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు. ఈనెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం సం దర్భంగా పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, దుస్తులు అందజేయాలని తెలిపారు. అ నంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ప్రత్యేకాధికారి బాలుయాదవ్, నోడల్ అధికారి నాగ్యనాయక్, హెచ్ఎంలు రామకృష్ణ, నర్సింహులు, కార్యదర్శి కల్పన, మాజీ ఉపసర్పంచ్ రవికిరణ్ పాల్గొన్నారు.
పాలమూరు, జూన్ 6 : మహబూబ్‌నగర్ మండలం ఫత్తేపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట ర్యాలీని డీఈవో రవీందర్ గురువారం ప్రారంభించారు.
నారాయణపేట రూరల్, జూన్ 6 : మండలంలోని వివిధ పాఠశాలల్లో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. లాల్ మసీదు పాఠశాలలో బడిబాట కరపత్రాలను డీఈవో అబ్దుల్‌ఘని ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉంటాయని, ప్రతి విద్యార్థికి ఏడాదికి రెండు జతల దుస్తులు అందిచడంతోపాటు మధ్యా హ్న భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే మండలంలోని జాజాపూర్, తిర్మలాపూర్, అమ్మిరెడ్డిపల్లి, లక్ష్మీపూర్,బసిరెడ్డిపల్లిలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్వో నాగార్జునరెడ్డి, సీఎంవో రాజేంద్రకుమార్, డీఎస్వో భానుప్రకాశ్, హెచ్ఎంలు జహీర్, కనకప్ప, జనార్దన్, కిశోర్‌కుమా న్, జనార్దన్‌రెడ్డి, శేర్‌కృష్ణారెడ్డి, ఉర్దూ ఫోరం అధ్యక్షుడు అమీరుద్దీన్, కార్యదర్శి గఫార్ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్, జూన్ 6: బడిఈడు పిల్లలను బడిలో చేర్పించి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని మక్తల్ ఎమ్మె ల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబా ట కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక తాసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే జెండా ఊపి ర్యాలీని ప్రా రంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతోపాటు పుస్తకాలు, యూనిఫాంలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు వెల్లడించారు. పాఠశాలల్లో ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించేందుకు అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య, ఎంఎన్‌వో అనిల్‌గౌడ్, ఉపాధ్యాయులు అరు ణ, జాకీర్ హుస్సేన్, సు ధీర్హెడ్డే, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, బాల ప్ప, వెంకట్రాములు, సృజన, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
ఊటూర్, జూన్ 6 : మెరుగైన విద్య కోసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని నిడుగుర్తి యూపీఎస్ హెచ్ఎం లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం బడిబాట కార్యక్రమం లో భాగంగా మహిళా సంఘం సభ్యులు, అం గన్వాడీ టీచర్లతో సమావేశమయ్యారు. బడిబాటను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో అంగన్వాడీ టీచ ర్ జ్యోతి, ఉపాధ్యాయులు పద్మ, సునీత, వెంకటప్ప, సుజా త, స లాం, ఆంజనేయులు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
దేవరకద్ర, జూన్ 6: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని గోపన్‌పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ హక్ అన్నారు. గురువారం మండల కేంద్రంతో పాటు అన్నిగ్రామాల్లో ప్ర భుత్వ ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించా రు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని వి ద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఐదేం డ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని కోరా రు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
భూత్పూర్, జూన్ 6: మండల వ్యాప్తంగా గురువారం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలోని తాటిపర్తి జెడ్పీ ఉన్న త పాఠశాలలో క్లస్టర్ హెడ్మాస్టర్ సంగీత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇస్తారని, ఫీజు లేకుండానే చదువుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పుల్లయ్య, సీఆర్పీ ఇక్రాం, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
మరికల్, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామ ని, సర్కారు బడుల్లో చేర్పించాలని ఉపాధ్యాయు లు కోరారు. గురువారం మండలంలోని ఆయాగ్రామాల్లో బడిబాటలో భాగం గా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.
జడ్చర్ల టౌన్, జూన్ 6 : మండలంలోని పెద్ద ఆదిరాలలో గురువారం జయశంకర్ బ డిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్పీహైస్కూల్తోపాటు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం మల్ల య్య మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే విద్యార్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఫీజులు లే కుండా నాణ్యమైన చదువుతోపాటు మధ్యా హ్న భోజన వసతి, పుస్తకా లు, యూనిఫాం లభిస్తోందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటయ్య, నర్సింగ్‌రావు, తాహే ర్, కృష్ణనాయక్, సరస్వతి, నాగేంద్రం, రవి పాల్గొన్నారు.
బాలానగర్, జూన్ 6 : బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలని మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఉ పాధ్యాయులు నా రాయణ, సరస్వతి అన్నారు. గురువారం బా లానగర్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో మండల కేంద్రం లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు శంకర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
కృష్ణ, జూన్ 6: మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో ఉ పాధ్యాయులు గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఖాన్‌దొడ్డి పాఠశాల విద్యార్థులతో ర్యాలి చేపట్టారు.