మహబూబ్‌నగర్ విద్యావిభాగం, నవంబ ర్ 14 : ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్య విస్తరించేందుకు అందివచ్చే ప్రతి అవకాశాన్ని స ద్వినియోగం చేసుకుంటూ విద్యాభివృద్ధే ల క్ష్యంగా ముందుకు సాగుతానని పీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.చెన్నప్ప తెలిపారు. పీయూ పరిపాలన భవనంలో గురువారం రిజిస్ట్రార్ గా చెన్నప్ప బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమష్టి కృషితోనే విశ్వవిద్యాలయానికి మంచిపేరు వస్తుందన్నారు. తాను ఒక ఉద్యోగినేనని, రిజిస్ట్రార్ అనేది బాధ్యత మాత్రమే అని పేర్కొన్నారు. సొంత జిల్లాకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు.
స్నాతకోత్సవం, నాక్ బృం దం పరిశీలనపై మొదటి ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. అంతర్గత సౌకర్యాలు మెరుగుపర్చడం, కొత్త కోర్సులు తీసుకురావడం, పీజీ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారిస్తానన్నారు. ఇ దిలా ఉండగా, చెన్నప్ప రిజిస్ట్రార్‌గా పాలమూరుకు రావడంతో ఆయన చెల్లెలు జయ మ్మ, తమ్ముడు మునిస్వామి కండ్లల్లో ఆనం దం వెల్లివిరిసింది. అన్నను జయమ్మ మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకుంటూ ఆనందభాష్పాలు రాల్చారు. ఈ సందర్భంగా వారిని శాలువా, పూలమాలలతో సన్మానించారు.
రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన చెన్నప్ప ను ఉప కులపతి శ్రీనివాస్, ఓఎస్డీటూ వీసీ మధుసూదన్‌రెడ్డి, పరీక్షల నిర్వహణ అధికారి డాక్టర్ రాజ్‌కుమార్, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కుమారస్వామి, పీయూ పీజీ క ళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, వివిధ విభాగాధిపతులు అభినందనలు తెలిపారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పుష్పగుచ్ఛా లు అందజేసి పూలమాలతో సత్కరించారు.
మక్తల్, నవంబర్ 14 : మండలంలోని కాట్రేవ్పల్లికి చెందిన చెన్నప్ప అంచెలంచెలు గా ఎదిగి పీయూ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. దాసరి లింగమ్మ, కుర్మయ్య దంపతులకు ఐదుగురు సంతానం (నలుగురు కుమారులు, ఒక కూతురు). అందులో రెం డో వారైన చెన్నప్ప చిన్నప్పటి నుంచి చదువు లో చురుకుగా రాణించేవారు. కాట్రేపల్లిలో ప్రాథమిక విద్య, మక్తల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్య, మహబూబ్‌నగర్ బాయ్స్ కళాశాలలో ఇంటర్, ఎంవీఎస్ కళాశాలలో డిగ్రీ, పీజీ సెంటర్లో ఉన్నత వి ద్యనభ్యసించారు.
1997లో ఉస్మానియా యూనివర్సిటీలో కామర్స్ విభాగం అసిస్టెం ట్ ప్రొఫెసర్‌గా నియామకమయ్యారు. 33 ఏండ్లుగా బోధన, పరిశోధన పరిపాలనలో అనుభవం గడించారు. గతంలో డీన్, ప్రిన్సిపాల్, విభాగాధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, చీఫ్ వార్డెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పీ యూ రిజిస్ట్రార్‌గా గురువారం చెన్నప్ప బాధ్యతలు చేపట్టడంతో స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. మారుమూల గ్రామంలో పుట్టినా చదువుపై ఆసక్తి ఉండడంతో కష్టపడి ఎన్నో విజయాలు అందుకున్నానని రిజిస్ట్రార్ చెన్నప్ప తెలిపారు.