కొల్లాపూర్, ఆగస్టు 30 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ (పీఆర్ఎల్ఐలో భాగంగా) మొదటి లిఫ్ట్ వద్ద నీటిని పంపింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన 400/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం చార్జింగ్‌ను సిస్టం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీతోపాటు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘురామారెడ్డి, విద్యుత్ సంస్థ ఉన్నతాధికారులకు స్థానిక ట్రాన్స్‌కో అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సబ్‌స్టేషన్‌కు ఏదుల రిజర్వాయర్ నుంచి విద్యుత్ సరఫరా తీసుకొని సెప్టెంబర్ 3వ తేదీన ప్రాజెక్టులో ఒక మోటర్తో డ్రైరన్, 15న వెట్న్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వీరి వెంట సాగునీటి పారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, చీఫ్ ఇంజినీర్ అమీద్‌ఖాన్, సూపరింటెండెంట్ ఏఎస్రావు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ అమర్‌సింగ్, డైరెక్టర్ ప్రాజెక్టు ట్రాన్స్‌కో నర్సింగరావు, డైరెక్టర్ లిఫ్ట్ ఇరిగేషన్ సూర్యప్రకాశ్‌రావు, పీఆర్ఎల్ఐ సీఈ శ్రీరాం, ట్రాన్స్‌కో డీఈ గోపికృష్ణ, ఎస్ఈలు, డీఈలు, ఏడీఈ గోపికృష్ణ ఉన్నారు.