మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఆగస్టు 3 : ప్రైవేటు స్కూళ్లల్లో ఇంటర్ పాసైనోళ్లు.. డిగ్రీ ఫెయిలైనోళ్లే పాఠాలు చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అనడాన్ని ఉమ్మడి పా లమూరు జిల్లాలోని నిరుద్యోగులు, ప్రైవేటు టీచర్లు తీ వ్రంగా ఖండిస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసినా ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవడంతో ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనే లక్ష్యంతో తాము ప్రైవేటులో పాఠాలు చెబుతూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నామని పే ర్కొంటున్నారు. తమ వద్ద విద్యనభ్యసించిన ఎందరో వి ద్యార్థులు దేశవిదేశాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో రాణిస్తున్నారని, ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడటం సమంజసం కాదన్నారు.
రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతస్థాయిలో ఉన్నవారి పిల్లలతోపాటు ప్రభుత్వ టీచర్ల పిల్లలంతా ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారనే విషయాన్ని సీఎం గుర్తించాలని హెచ్చరించారు. ప్రైవేటు టీచర్లుగా కొనసాగుతున్న వారంతా ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయినోళ్లు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ టీచర్లకంటే తాము గొప్పవారం కాకపోయినా.. వారితో సమానంగా విద్యాబోధన చేస్తున్నామని అనేందుకు పోటీ పరీక్షల్లో వస్తున్న ఫలితాలే నిదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బేరీ జు వేసుకున్నా.. తామేంటో ఇట్టే అవగతం అవుతుందని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
నేను చదువు చెప్పిన పిల్లలు ఇప్పుడు ఇతర దేశాల్లో ఆస్ట్రేలియా, అమెరికాలో మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. మాకు చదువులు రావట్లేదంటే మరి వారెలా విదేశాల్లో రాణిస్తున్నా రో సీఎం సార్ చెప్పాలి. పిల్లలకు మేము స్ఫూర్తిగా నిలుస్తు న్నాం. వారి తల్లిదండ్రులు మమ్మల్ని నమ్ముకొని పంపిస్తున్నారు. ఎక్కడో ఉన్నవారి గురించి ఎందుకు.. గవర్నమెంట్ టీచర్ల పిల్లలే ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఇది చాలాదా..! ప్రైవేటులో ఎంత నాణ్యమైన విద్య అందుతుం దో.. మేం ఎంతో కష్టపడి చదువుకొని డిగ్రీలు అందుకు న్నాం. అందర్ని ఒకేగాటిన కడతామంటే ఎట్లా.. ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టు కాదు..
– డీ రూపవతి, ఎంఏ బీఈడీ, నవాబ్‌పేట
నేటి పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా మెరుగైన గుణాత్మ క విద్యను అందిస్తున్నాం. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనది. అది ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా ఉండదు. అవకాశాలకు అనుగుణంగా కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు సా ధించారు. కొందరికి రాకపోవడంతో ప్రైవేటుగా బోధిస్తున్నారు. నిరుద్యోగులను అనే ముందు ఒక్కసారి ఆత్మవిమ ర్శ చేసుకోవాలి. హైస్కూల్స్‌లో ఎక్కడైనా ఇంటర్, డిగ్రీ ఫె యిల్ అయినవారు బోధిస్తున్నారా.? అనే విషయాలు పరిగణలోకి తీసుకోకుండా అలా మాట్లాడటం సమంజసం కానే కాదు.. నిరుద్యోగులంటే అంత చులకనభావం ఏ మాత్రం పనికిరాదు.
– నీరజ, బీఎస్సీ బీఈడీ, రాజేంద్రనగర్, మహబూబ్‌నగర్
అచ్చంపేట టౌన్, ఆగస్టు 3 : ప్రైవేట్ ఉపాధ్యాయులను అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడడం సరికాదని, వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫో రం అధ్యక్షుడు రవినాయక్ డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పట్టణంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం మైదానంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ప్రైవే ట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అయిన వారని పేర్కొనడం శోచనీయమన్నారు. చాలీచాలని వేతనాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతున్న తమను సీఎం కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు.
సీఎం సార్ ఇలా రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వొద్దు.. ప్రై వేటు పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. అవసరం అనుకుంటే డీఈవో ఆఫీసుల్లో రికార్డులు తనిఖీ చే సుకోవాలి. అంతేకానీ ఇలా నిరుద్యోగులను కించపర్చేలా మాట్లాడవద్దు. ఎం ఎస్సీ, బీఈడీ చేశా.. పోస్టు లు తక్కువగా ఉండడంతోనే తనకు ప్రభుత్వ ఉ ద్యోగం రాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో ఖాళీ లు ఉన్నాయి. వాటన్నింటినీ భర్తీ చేయండి.. అనేక రకాలైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక.. ఇలా మాట్లాడటం సరైనది కాదు.
– శిరీష, ఎంఎస్సీ బీఈడీ, మహబూబ్‌నగర్
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల ఫలితాల వెల్లడి సమయంలో వచ్చే రిజల్ట్స్ బేరీజు వేసుకోవాలి. ఊరికే మాట్లాడితే కాదు.. మేం నాణ్యమైన విద్య అందిస్తున్నాం కాబట్టే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల్ని చేర్పిస్తున్నారు. పేరేంట్స్ పూర్తి అవగాహనతోనే అడ్మిషన్ సమయంలో టీచర్ల సీనియారిటీ, విద్యార్హత పరిశీలించి అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఎంఏ, ఎంఈడీ చదివినం. జీవనోపాధిలో భాగంగా ప్రైవేటు టీచర్‌గా రాణిస్తున్నాం. నిరుద్యోగులుగా ఊరికే ఉండకుండా స్వయం ఉపాధి, సామాజిక సేవలో భాగంగా ప్రైవేటు టీచర్లుగా మారాం. అంతేకానీ ఇంటర్, డిగ్రీ ఫెయిల్ అంటే ఎట్లా.. ఇది సరికాదు.
– నాజియా సుల్తానా, ఎంఏ ఎంఈడీ, షాషాబ్‌గుట్ట, మహబూబ్‌నగర్