మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 12 : ఇంటర్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించగా యాజమాన్యాలు విద్యార్థులను అభినందించాయి.
ప్రతిభ అద్భుత విజయం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో ప్రతి భ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత విజ యం సాధించారని ఆ కళాశాల యాజమాన్యం తెలిపింది. ఫస్టియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గానూ 468 మార్కులు కె.రిషిక, ఆర్.రిషిత, కె.చందన, ఎస్.ప్రసన్నతార, వై.నందకిశోర్, డి. అపూర్వరాజ్, జి.జశ్వంత్, రిత్విక్కుమార్, వి.హృ షికేష్ సాధించారన్నారు.
ఏ.షరద్యుతి, సి.సాయినాథ్, సి.అభినయ, డి.భువనకృతి, ఇ.అభిలాషిని, జి.శ్రావ్యవీణ, పి.రఘోత్తమరావు, శ్రియారెడ్డి, మౌనిక, స్నేహిత 470మార్కులకు గానూ 467 మార్కులు సాధించి విజయ కేతనం ఎగరవేశారని తెలిపారు. బైపీసీ విభాగంలో 440మార్కులకు గానూ డి.మానస-438 మార్కులు, ఆర్.నవ్య-437, రుమన ఫిర్దోస్-437, హానియ కుర్రతులైన్-437, ఇక్రరహ్మత్-437, ఎన్.సాహితి-436, జి.శ్రీకాంత్-436, కె.వీణ-436, షఫీన్ ఫాతిమా-435 మార్కులు సాధించారని తెలిపారు. సెకండియర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు గానూ అత్యధికంగా ఇ.వైష్ణవి-994 సాధించగా యు.

వైష్ణవి-993, డి.హర్షిత-993, కె.రాఘవి-993, కె.శ్రీవల్లి-992, పి.త్రిష-991, జి.సాయిశ్రీరెడ్డి-991, కె.శివాణి-991, టి.నేహారెడ్డి-991, జవేరియాకుర్రతులైమ్-990, పి.శ్రీనితిన్-990, ఎం.అమూల్య-990, కె.సిద్ధార్థ-990, సి.సాయిచరిత-990, కె.నిఖిల్చారి-990, కె.రాజరాజేశ్వరీ-990 మార్కులు సాధించారు. బైపీసీ సెకండియర్‌లో కె.వైష్ణవి-992, పి.సుప్రజ-991 మార్కులు సాధించారని తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో 400మార్కులకు పైగా 432మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. సెకండియర్ ఎంపీసీ, బైపీసీ విభాగంలో 900మార్కులకు పైగా 508 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, అధ్యాపక బృందానికి, సహకరించిన తల్లిదండ్రులకు ప్రతిభ కళాశాల గౌరవ సలహాదారులు కె.మంజులాదేవి, వి.లక్ష్మారెడ్డి, కె.విష్ణువర్ధన్‌రెడ్డి, కె.రఘువర్ధన్‌రెడ్డి, కె.జనార్దన్‌రెడ్డి, జి.వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు అభినందించారు.

ఇంటర్ ఫలితాల్లో రిషి కాలేజీ విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో రికార్డు స్థాయి ఫలితాలు సాధించి ఉమ్మడి పాలమూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారని ఆ కళాశాల డైరెక్టర్ వెంకటయ్య తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీ విభాగంలో యు.వినయ్‌కుమార్‌గౌడ్ 470కి గానూ 468 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారని, వేణుమాధవ్‌రెడ్డి, జి.అంకిత్, జి.మాధురి, ఏ.కార్తీక్‌రెడ్డి, సృజన తదితరులు 467 మార్కులతో ప్రతిభ చాటారని అన్నారు. బైపీసీ విభాగంలో కె.అక్షిత, తానియా మహమూద్ 440 మార్కులకు 438 సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారన్నారు.
శ్రావణి, భవిత, సౌమ్య, సురేంద్ర చక్రవర్తి, అక్షిత, ఆయేషాజువా, అఖిల, ఆశ్లేష యాదవ్, మౌనిక, రిషిత, నాగసాయి వైష్ణవి, మైవిన్, కె. మీనాక్షీ సహా 14మంది విద్యార్థులు 437 మా ర్కులు సాధించారన్నారు. సెకండియర్ ఎంపీసీలో ఎం.భావన 995 మార్కులతో రికార్డు ఫలితం సాధించిందన్నారు. మెహమ్మద్ అశ్వాక్ అహ్మద్, సయ్యద్ మిస్భావుద్దీన్, శ్రీవిద్య 992 మార్కులు సాధించగా, కోటేశ్వర్ 990 మార్కులు సాధించా రు. బైపీసీ విభాగంలో అప్సామోయిన్, పి. గాయ త్రి 994మార్కులతో అగ్రస్థానాన్ని సాధించిందన్నా రు. షారియా, ఫాతిమా ఖదీర్-993 మా ర్కులు నందినిరెడ్డి, వైశాలి-992, శ్రీనిధి-991, సృజన, సుమేరాబేగం-900మార్కులతో ప్రభంజనం సృ ష్టించారని తెలిపారు. విద్యార్థులను కళాశాల చైర్పర్సన్ చంద్రకళ వెంకట్, డైరెక్టర్ వెంకట య్య, డీన్ భూపాల్‌రెడ్డి, అకాడమిక్ డీన్ కళ్యాణ్‌బాబు, ప్రిన్సిపాల్ రాఘవేంద్రరావు అభినందించారు.
జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు నేడు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారని ఆ కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి తెలిపారు. కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో మాట్లాడారు. ఫస్టియర్ ఎంపీసీ విభాగంలో భరత్‌కృష్ణ 468మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ సాధించగా సంజన-467 మార్కులు సాధించిందన్నారు. బైపీసీ విభాగంలో సిద్ర ఫాతిమా 438మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు, కాన్స తబస్సుమ్ 437 మా ర్కులతో రాష్ట్ర స్థా యిలో 2వ ర్యాం కు సాధించారని తెలిపారు.
సె కండియ ర్ ఎంపీసీ విభాగంలో ఆస్పియా తబస్సుమ్-994, వైశా లి-993, అమీనా మరియమ్, కౌశిక్-991 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో అనువర్షిత-993, ఉమామ్ అనమ్-991మార్కులతో అత్యుత్తమ ప్రతిభ చాటారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గీతాదేవి, అకాడమీ ఇన్చార్జి పావనిరెడ్డి, యాజమాన్య సభ్యులు రాఘవేంద్రరావు, నాగేందర్, సతీశ్‌రెడ్డి, రఘువరన్రెడ్డి, నరేశ్, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతినందన్‌రెడ్డి పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని అక్షర జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్లో అద్భుత ఫలితాలు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ కె.విజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో పి.వర్షిత-464, భువనేశ్వరీ, సయ్యద్ ఇప్తేషాముద్దీన్-460 మార్కులు సాధించారని తెలిపారు. బై పీసీ విభాగంలో రిహ ఫిరదౌస్-433, సైదా కుబ్ రా ఫాతిమా-424, జి.మేఘన, అక్షర పతాక్-421, బి.మహేశ్-418 మార్కులు, బైపీసీ సెకండియర్‌లో బి.శ్రావణి-989, షాఫీన్-982, ఊర్మిళ-981, షాజీయాబేగం-979, సాధియా ఫిరదౌ స్ -975 మార్కులు, సెకండియర్ ఎంపీసీలో కె.భరద్వాజ్-980, ఎం.నవీన్‌కుమార్-977, మణిదీ ప్-957, పవన్చారి-956 సాధించారన్నారు. వీ రిని కళాశాలసెక్రటరీ ఫణిప్రసాద్ అభినందించారు.
ఇంటర్ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని జలజం జూనియర్ కళాశాల విద్యార్థులు కామర్స్, ఆర్ట్స్ గ్రూప్‌ల్లో సంచలన ఫలితాలు సాధించారని కళాశాల డైరెక్టర్ ఎస్.రమేశ్‌గౌడ్ తెలిపారు. ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి ఇం టర్ బోర్డు కొత్తగా ప్రారంభించిన ఏసీఈ గ్రూప్‌ను జలజం కళాశాలలో అందుబాటులో తీసుకొస్తున్నామని తెలిపారు. ఫస్టియర్‌లో 500 మార్కులకు డి.హరిణి పూజిత-490 మార్కులు, జి.ప్రేమ్‌కుమార్-483, సురగౌరి శ్రీనిత్య-481, ఎం.సం తోష్-476, జి.హాసిని-473, ఎండీ. జీషాన్-472 మార్కులు సాధించారని తెలిపారు. సెకండియర్‌లో జి.ప్రణవ్‌కుమార్-982 మార్కులు, ఎన్.సాహితీ-977 సాధించారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.
ఇంటర్ ఫలితాలో సీవీ రామన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించి విజయ పరంపర కొనసాగించారు. ఇందులో 900 మార్కులకు పైగా 133 మంది విద్యార్థులు సాధించారు. ఎంపీసీ సెకండియర్‌లో మేఘన 993, అక్షయ, అన్షిక, సానియా, స్వాతి, శ్రావణి 989, హర్షరెడ్డి , తనుశ్రీ, కార్తీక్, సాగర్ 989 మార్కులు, బైపీసీ విభాగంలో లక్ష్మీనారాయణ 991, పి.సూర్యవర్షిణి 986, మధుసుదన్‌రెడ్డి, కావ్య 979, ఎంఈసీ విభాగంలో నందిని 983, జ్ఞానేశ్వరి 967, సీఈసీ విభాగంలో వైష్ణవి 884, రామాంజనేయులు 828 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించారు.
జాగృతి విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాం కులు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ సెకండియర్ బైపీసీలో అనుష్ణ 994 , ఎన్.అర్చన 993, ఎంపీసీ విభాగంలో కె.అపూర్వ, త్యాగరాజు 992, లావణ్య, హిందు 991 మా ర్కులు, ఎం ఈసీ విభాగంలో యశ్వంత్ 965, సీఈసీ విభాగం లో ఎం.శ్రీలత 954 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు. ఫస్టియర్ బైపీసీ విభాగంలో ఉజ్మాహజారా 438, ఎం.హరీష, స్వ ప్న 437, అశ్విని 435, ఎంపీసీ విభాగంలో హేమలత, గాయత్రిల 466, సాయిచరణ్‌తేజ 465 మా ర్కులు సాధించారు. ఎంఈసీలో శ్రావణ్‌కుమార్ 460, సీఈసీలో పి.ప్రణిత 491, డి.శ్రావణి 482 సాధించి టాపర్లుగా నిలిచారు. వీరిని ఆయా కళాశాలల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు అభినందించారు.