అయిజ, మార్చి 23: అరెస్టులతో సర్కారును నడపలేరని ఆశ వర్కర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆశ వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చలో అసెంబ్లీ ముట్టడికి సీఐటీయూ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం ఆశ వర్కర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీకి వెళ్లేందుకు యత్నిస్తున్న తమను పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమం ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు. డిమాం డ్ల పరిష్కారం కోసం నిరసన చేస్తున్న ఆశ వర్కర్లను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం సమంజసం కాదన్నారు. నిరసన తెలిపేందుకు ప్రజాస్వామ్యంలో హక్కు ఉందన్నారు. హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లే దన్నారు. ఆశ వర్కర్లను ఎంత అణచివేయాలని ప్రయత్నిస్తే అంత ఉవ్వెత్తున ఉ ద్యమం ఎగిసిపడుతుందన్నారు. అనంతరం సోమవారం చలో అసెంబ్లీకి వెళ్లరాదని, తిరిగి ఉదయం పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఎస్సై శ్రీనివాసరావు హెచ్చరించి సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.