వెల్దండ : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులకు ( Illgal Arrest ) భయపడేది లేదని పీడీఎస్యూ(PDSU Leader) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ నాయక్ అన్నారు. శుక్రవారం వెల్దండలో పోలీసులు అతడిని ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో రోడ్డు శంకుస్థాపనకు కాంగ్రెస్ మంత్రులు వస్తున్న సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ ఇంటికి వెళ్లి అక్రమంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తుందన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని అన్నారు.