మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 22: ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత విజయం సాధించారని యాజమాన్యం తెలిపింది. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు ఇ.వైష్ణవి 468, ఎం.ఉపేంద్ర 468, యం. విజయలక్ష్మి 467, డి.గణేశ్ 467, పి.అక్షితారెడ్డి 467, సాయిచరణ్ 467, డి.కీర్తి 466, భవనేశ్ 466, అయిషాతహరీన్ 466, డి.హర్షిత 466, కె.వర్షిణి 466, హురియా రశీద్ 466, ఆర్.విశాల్ 466, కె.శోభారాణి 466, యం.నవీన్‌కుమార్ 466, పి.శ్రీనితిన్ 466, త్రిష 466 మార్కులు సాధించారు.
మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో 440 మార్కులకు నెక్కొండ హాసిని 436, కె.వైష్ణవి 436, పి.సుప్రజ 435 మార్కులు సాధించారు. రెండో సం వత్సరం ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు బి.అక్షిత 994, ఎల్.ఆమోఘ్ 993, ఎం. భవిత 992, డి.శివజ్యోతిక 992, తమీమఫాతిమా 992, ఎన్.వర్షిత్గౌడ్ 992 మార్కులు సాధించారు. రెండో సంవత్సరం బైపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు ఎ.అక్షిత 994, అజీం కౌసర్ 991, జైన్‌బిన్ మొహమ్మద్ 990, ముడావత్ భూమిక 990 మార్కులు సాధించారు.
మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో 400 మార్కులకు పైగా 514 మంది విద్యార్థులు సాధించగా.. రెండో సంవత్సరంలో 900ల మార్కులకుపైగా 462 మంది విద్యార్థులు సాధించారని పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు అహర్నిశలు కృషిచేసిన అధ్యాపక బృందం, సహకరించిన తల్లిదండ్రులకు ప్రతిభ కళాశాల గౌరవ సలహాదారులు మంజులాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డిలు అభినందించారు.