గద్వాల, జూలై 28 : అధికారులు సమిష్టిగా పనిచేసి జి ల్లా అభివృద్ధికి పాటుపడాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఐడీవోసీ చాంబర్లో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ క్రాంతి, ఎస్పీ సృజన, గ ద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహంతో కలిసి సమీక్షలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం పై సంబంధిత అధికారులతో ఆరా తీశారు. డీఏవో గోవింద్‌నాయక్ స్పందించి ఇప్పటివరకు లక్షా50వేల ఎకరాల్లో వివిధ పంటలు సా గు చేశారని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. అధికారులు రైతువేదికల్లో సమావేశాలు ని ర్వహించి రైతులతో మాట్లాడాలన్నారు. హరితహారంలో మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 92శాతం మొక్కలు నాటినట్లు డీఆర్డీవో ఉమాదేవి తె లిపారు. మహిళా సంఘాలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, వారు ఆర్థికంగా ఎదిగేలా అవకాశాలు కల్పించాలని సూచించారు. 255 జీపీల్లో శా నిటేషన్, క్లోరినేషన్ పనులు ముమ్మరంగా చేపట్టాలని డీ పీవో శ్యాంసుందర్‌ను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రోడ్లను పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించగా, ఎమ్మెల్యే బండ్ల స్పందిస్తూ ఆర్అండ్బీ డీఈ, ఈఈ ఇక్కడ ఉన్నంత కాలం రోడ్లు బాగుపడవని, వారు పనులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖలో కొనసాగుతున్న పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు. జిల్లాలోని జర్నలిస్టుల జాబితా తయారు చేసి, ప్లాట్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, ఆయాశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉప్పలలో సబ్ స్టేషన్ ప్రారంభం
వ్యవసాయ, ఐటీ, పారిశ్రామిక, ఉ పాధి రంగాలకు విద్యుత్‌ను అందిస్తుండడంతో తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా ఉన్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అ యిజ మండలంలోని ఉప్పలలో రూ.1.45కోట్లతో ని ర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నదన్నారు. కరెంట్ కోత, లో ఓల్టేజ్ సమస్య ఉండొద్దనే ఉద్దేశంతో రెండు, మూడు గ్రామాలకో సబ్‌స్టేషన్‌ను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉప్పల సమీపంలోని వాగుపై వంతెన నిర్మించాలని, మేడికొండను మండలం గా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు మం త్రికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, ఎస్ఈ భాస్కర్, డీఈ లక్ష్మణ్, ఏడీఈలు గోవిందు, శ్రీనివాస్, దినేశ్‌కుమార్, ఎంపీపీ నాగేశ్వర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దేవన్న, తాసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో సాయిప్రకాశ్, ఏఈ బాలస్వామి, ఏవో శంకర్‌లాల్, ఉప్పల క్యాంపు సర్పంచ్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
అగ్గిపెట్టెల్లా ట్రాన్స్ఫార్మర్లు
కేటీదొడ్డి, జూలై 28 : గతంలో ఒక్క ట్రాన్స్ఫార్మర్ కోసం రైతులు పడిగాపులు కాసేవారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అగ్గిపెట్టెల్లా ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మండలంలోని ఇర్కిచేడులో 33-11 కేవీ సబ్‌స్టేషన్, రైతువేదిక, దళితబంధు యూనిట్లతో ఏర్పాటు చేసిన కోళ్లఫారం, గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యేలు బండ్ల, అబ్రహంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ పార్టీ రైతులకు ఫ్రీగా క రెంటు ఎందుకివ్వాలి? మీటర్లు పెడదాం అంటోంది.. ఇంకొక పార్టీ రైతులకు 24గంటల కరెంటు ఎందుకు మూడు గంటలు చాలు అంటుంది. అలాంటి పార్టీలను చేరదీస్తే రైతుల బతుకులు చీకటిమయంగా మారుతాయన్నారు. దళితబంధు పథకంతో లబ్ధిదారుల జీవితాల్లో వె లుగు నిండుతుందన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్ర హం, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మ ప్ప, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, మార్కెట్‌యార్డు చైర్మన్ శ్రీధర్‌గౌడ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామన్‌గౌడ్, ఎంపీపీలు మనోరమ, విజయ్, జెడ్పీటీసీ లు పద్మావెంకటేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉరుకుందు, నాయకులు పాల్గొన్నారు.