గద్వాల అర్బన్, నవంబర్ 5 : మహిళలకు సంబంధించి వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు గద్వాల సీఐ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం గద్వాల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ విలేకరులతో మాట్లాడారు. కొన్ని రోజులుగా జిల్లాకు చెందిన మహిళల అశ్లీల వీడియోలు, ఫొటోలు కలకలం రేపాయి. సామజిక మద్యమంలో వచ్చిన వీడియోలు, ఫొటోలను ఎవరు బయటపెట్టారు.. అనే విషయంపై పోలీసులు విచారణ చేశారు. అందులో భాగంగా జిల్లా కేంద్రానికి చెందిన తిరుమలేశ్, అఖిల్.. కొంతమంది మహిళలతో సానిహిత్యంగా ఉంటూ వారితో అశ్లీల వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ తరువాత వాటిని సామజిక మద్యమంలో విడుదల చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు చెప్పారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నారన్నారు. ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారన్న విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
ఎవరినీ వదిలిపెట్టం.. : ఎస్పీ రంజన్త్రన్ కుమార్
మహిళల అశ్లీల వీడియోలు, ఫొటోలను షేర్ చేసినవారిపై చర్యలు తీసుకుంటామని జోగుళాంబ గద్వాల ఎస్పీ రంజన్త్రన్ కుమార్ శనివారం ప్రకటనలో హెచ్చరించారు. బాధ్యులను తక్షణమే పట్టుకునేందుకు పోలీసులను ఏర్పాటు చేశామన్నారు. ఈ విషయంలో ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు.
చాలా బాధగా ఉన్నది : ఎమ్మెల్యే బండ్ల
మహిళల వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడం బాధాకరంగా ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మహిళలను వేధిస్తున్న వారు ఏ పార్టీ నాయకులైనా చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపారు. వారికి శిక్ష పడేంత వరకు తన వంతు సహాయ, సహకారాలు ఉంటాయన్నారు.