వనపర్తి టౌన్, ఏప్రిల్ 20 : వనపర్తి జిల్లాకేంద్రంలో జగిత్యాల కేసీఆర్ బహిరంగ సభ ఎల్ఈడీ ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ హనుమాన్ ఆలయం ఎదుట బీఆర్ఎస్ కార్యాలయం వద్ద జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభను కాలనీ ప్రజలు వీక్షించేందుకు సోమవారం స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై హరిప్రసాద్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని ప్రదర్శనను నిలిపి వేయించారు. జగిత్యాల సభ ప్రత్యక్ష ప్రసారం కోసం 20వ వార్డు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసుకుంటే పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేశారు.
ఉదయమే ఠాణాకు వెళ్లి అప్పిల్ చేశామని చూస్తామని చెప్పి సభకు సంబంధించిన స్క్రీనింగ్‌ను అడ్డుకోవడం ఏంటని అశోక్, సునీల్ వాల్మీకి, హేమంత్ ముదిరాజ్‌లు అన్నారు. ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా రాజకీయ దురుద్దేశంతోనే అడ్డుకున్నారని తీవ్రంగా ఖండించారు. అధికారులు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే నడుచుకోవాలని, అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొద్దని హితవు పలికారు. వీరికి లోక్‌సత్తా రాష్ట్ర కమిటీ సభ్యులు రాజ్‌కుమార్ మద్దతు పలికారు. కార్యక్రమంలో గులాంఖాదర్ ఖాన్, గిరి, రహీం, ప్రేమ్‌కుమార్, ఏకే పాషా, సుబ్బు, రాజ్‌కుమార్, విజయ్, భీంసాగర్, రాజు తదితరులు ఉన్నారు.