అచ్చంపేట : బహిరంగ ప్రదేశాల్లో నిషేదిత గంజాయి( Cannabis ) పండిస్తే పోలీసులకు దొరికిపోతామన్న భయంతో ఓ యువకుడు ఏకంగా ఇంటిలోనే గంజాయి సాగును మొదలు పెట్టాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎట్టకేలాగు పోలీసులు దాడి జరిపి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.
గంజాయికి బానిసగా మారి ఇంట్లోనే గంజాయి సాగు చేస్తున్న యువకుడు
ఇంట్లో గంజాయి మొక్కను గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామంలో గంజాయికి బానిసగా మారి ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్న నాగనులు మధు అనే యువకుడు… pic.twitter.com/sTZLJrpHyB
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2025
జిల్లాలోని అచ్చంపేట (Achempet ) మండలం పల్కపల్లి గ్రామంలో నాగనులు మధు అనే యువకుడు గంజాయికి బానిసగా మారి ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. గంజాయి సాగు, అక్రమ రవాణాపై , విక్రయాలపై పోలీసులు గట్టి నిఘా వేయడంతో పాటు తనిఖీలు, దాడులు చేస్తూ గంజాయిని పట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలోని మధు ఇంటిపై దాడి జరిపి గంజాయి మొక్కను గుర్తించి యువకుడిని అదుపులోకి తీసుకున్న స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.