గద్వాల అర్బన్, డిసెంబర్ 26 : గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం పోలీసులు దాడులు చేసి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. గద్వాల టౌన్ ఎస్సై కల్యాణ్ కుమార్ వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో నలుగురు యువకులు ఓ ఇంటిని కిరాయి తీసుకొని కొన్నిరోజులుగా గుట్టుగా వ్యభిచారం నిర్వహిసున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందడంతో వారు వ్యభిచార గృహంపై దాడులు చేసి ఒడిశాకు చెందిన మహిళతో పాటు నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. రవి, తిరుమలేశ్, అరుణ్‌తో పాటు మరో యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.