మూసాపేట, జూలై 9 : కూలీ పనులు చేస్తూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం మూసాపేట మండలంలోని జానంపేట గ్రామంలో చోటు చేసుకున్నది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జానంపేట గ్రామానికి ఎందిన సల్ల యాదయ్య(52) అదే గ్రామానికి చెందిన అచ్యుతారెడ్డి వ్యసాయ పొలంలో పనులు చేసేందుకు కూలీకి వెళ్లాడు. కొంత సమయం తర్వాత అతను మృతి చెం దిన విషయం గ్రామంలో తెలియడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
మృతుడు యాదయ్య వ్యవసాయ బోరు మోటర్ వద్ద పనులు చేస్తుండగా అక్కడేపడి మృతి చెందినట్లు గుర్తించారు. అతని శరీరంపై కాలీన గాయాలతో కరిగేట్లో పడి మృతి చెందడంతో విద్యుత్ షాక్‌తోనే మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. కానీ కొంత మంది విద్యుత్ షాక్ కాదని, కూలీ పనులు చేస్తూ మృతి చెందాడనే పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు పోస్టుమార్టం అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని మృతదేహాన్ని జిల్లా దవాఖానకు తరలించారు. మృతునికి ఇద్దరు కూమార్తెలు, భార్య ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా సల్ల యాదయ్య వ్యవసాయ పనులు చేస్తూ అనుమానాస్పందగా మృతి చెందిన మాట వాస్తవమే కానీ తమకు ఇంకా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు.